News January 25, 2025

రాజోలు: నలుగురు విద్యార్థులకు భారీ ఉపకార వేతనాలు

image

రాజోలు మండలం ఓ ప్రేయివేట్ కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినిలు రిలయన్స్ ఫౌండేషన్, లెగ్రాండ్ సంస్థలు అందించిన భారీ ఉపకార వేతనాలు అందుకున్నారని కళాశాల ప్రిన్సిపల్ ఆర్.ఏ.స్వామి శనివారం తెలిపారు. గిరుగు సుష్మ (రూ.4,40,000), చింతా హెప్సిబా (2,00,000), బండారు తేజావతి (2,00,000), ముచ్చర్ల కేశవ కుమారి (2,00,000) ఉపకార వేతనం పొందారని తెలిపారు. భారీ ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులను పలువురు అభినందించారు.

Similar News

News September 15, 2025

నిజంగా రూ.1200కు ఉల్లి కొన్నారా?: SV

image

చంద్రబాబు సర్కారుకు ఉల్లి రైతుల కష్టాలు కనిపించవా? అని వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నిజంగా రూ.1,200తో ఉల్లిని కొనుగోలు చేస్తే రైతులు ఎందుకు రోడ్లపై పడేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందని, వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

News September 15, 2025

HYD: రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న ఈగల్ టీమ్

image

మత్తు పదార్థాలను తరలించే ముఠాలపై తెలంగాణ ఈగల్ టీమ్ ఉక్కుపాదం మోపింది. జీఆర్పీ, ఆర్పీఎఫ్, స్థానిక పోలీసులతో కలిసి గతనెల 22 నుంచి ఈ నెల 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో సంయుక్త ఆపరేషన్లు నిర్వహించింది. ఇందులో 12 మందిని అరెస్టు చేసి వారి నుంచి రూ.1.09 కోట్ల విలువైన డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది.

News September 15, 2025

రూ.5కే టిఫిన్.. ఈ నెలాఖరులోపు ప్రారంభం!

image

TG: హైదరాబాద్‌లో ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా ఈ నెలాఖరు నుంచి రూ.5 కే టిఫిన్స్ అందించేందుకు GHMC సిద్ధమవుతోంది. పాత స్టాల్స్ స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి ముందుగా 60 చోట్ల ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇడ్లీ, పొంగల్, పూరి, ఉప్మా వంటి అల్పాహారాలు అందుబాటులో ఉంచనున్నట్లు సమాచారం. ఒక్కో బ్రేక్ ఫాస్ట్‌కు రూ.19 ఖర్చవుతుండగా రూ.14 జీహెచ్ఎంసీ భరించనుంది.