News January 25, 2025

కొండగట్టు అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించిన కృష్ణ ప్రసాద్

image

కొండగట్టు అదనపు ఈవోగా కృష్ణ ప్రసాద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈనెల 18న ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీకాంతరావు సెలవులో ఉండడం వలన, హైదరాబాద్ దేవాదాయశాఖలో డీసీఎస్‌గా విధులు నిర్వహిస్తున్న కృష్ణప్రసాద్‌కు కొండగట్టు ఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. నూతన ఈవోకు ఆలయ అధికారులు అర్చకులు శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈనెల 30న హుండీ లెక్కింపు కార్యక్రమం చేపడుతున్నట్లు ఈవో తెలిపారు.

Similar News

News September 15, 2025

కృష్ణ: 100 ఏళ్ల నాటి నిజాం కాలం వంతెన

image

నిజాం కాలంలో నిర్మించిన పురాతన రాతి వంతెన వందేళ్లు గడిచినా ఇప్పటికీ చెక్కుచెదరలేదు. గచ్చుతో నిర్మించిన ఈ వంతెన భారీ వరదలు ముంచెత్తిన చిన్న మరమ్మతు కూడా అవసరం రాలేదు. NRPT జిల్లా కృష్ణ మండలం వాసునగర్- శక్తి నగర్ మధ్య ఈ వంతెన నిర్మించారు. నిర్మాణ శైలి అర్ధ చంద్రాకారంలో ఉండే 18 ఖానాల (వెంట్)తో ఈ వంతెన నిర్మించారు. ఖానా మధ్యలోని రాయి భారం మోస్తుందని ఇంజినీరింగ్‌ల అభిప్రాయం. నేడు ఇంజినీర్ల దినోత్సవం.

News September 15, 2025

కిమ్ ఆగడాలు.. మూవీస్ షేర్ చేస్తే చంపేశారు!

image

నార్త్ కొరియాపై యునైటెడ్ నేషన్స్ ఇచ్చిన 14 పేజీల రిపోర్టులో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. దేశం విడిచి పారిపోయిన 300 మంది ప్రత్యక్ష సాక్షులు, బాధితుల వాంగ్మూలాల ఆధారంగా ఆ నివేదిక తయారు చేశారు. ‘2015లో తీసుకొచ్చిన చట్టాలు, పాలసీలతో పౌరులపై సర్వేలైన్స్, అన్ని విధాలుగా వారి జీవితాలపై ఆధిపత్యం పెరిగింది. ఆఖరికి ఫారిన్ మూవీస్, K-డ్రామాలు షేర్ చేసుకున్నారని ఎంతో మందిని చంపేశారు’ అని నివేదికలో ఉంది.

News September 15, 2025

మైథాలజీ క్విజ్ – 6

image

1. వ్యాస భాగవతంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి?
2. సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేసిన అడవి పేరేంటి?
3. కంసుడు పరిపాలించిన రాజ్యం?
4. మొధెరా సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది?
5. శ్రావణ మాసం పౌర్ణమి నాడు వచ్చే పండగ ఏది? (సరైన సమాధానాలను కామెంట్ చేయండి. జవాబులను రేపు 7AM పబ్లిష్ చేస్తాం.)
<<17696624>>మైథాలజీ క్విజ్ – 5<<>> ఆన్సర్స్: 1.భూమి, ఆకాశం 2.త్రయంబకేశ్వర ఆలయం 3.మాఘ మాసం 4.భీష్ముడు 5.సీత