News January 25, 2025
VSR రాజీనామాకు ఆమోదం.. బులెటిన్ రిలీజ్

AP: రాజ్యసభ ఎంపీ పదవికి విజయసాయిరెడ్డి చేసిన రాజీనామాను ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ఆమోదించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రకటన విడుదల చేశారు. VSR రాజీనామాతో ఒక రాజ్యసభ స్థానం ఖాళీ ఏర్పడింది. కాగా రాజకీయాలకు పూర్తిగా దూరమవుతున్నట్లు నిన్న విజయసాయి ప్రకటించిన సంగతి తెలిసిందే.
Similar News
News November 11, 2025
నిఠారి కిల్లింగ్స్: సురేంద్ర కోలికి సుప్రీంలో ఊరట

నిఠారి వరుస హత్యల చివరి కేసులో సురేంద్ర కోలి దోషి కాదని సుప్రీంకోర్టు ఇవాళ తీర్పిచ్చింది. మిగతా కేసుల్లోనూ రిలీఫ్ పొందిన కోలి త్వరలో జైలు నుంచి విడుదల కానున్నాడు. నోయిడా శివారు నిఠారి గ్రామంలో 2006 DEC 29న మోహిందర్ పందేర్ ఇంటి వెనక డ్రెయిన్‌లో 8 మంది చిన్నారుల ఎముకలు లభ్యమయ్యాయి. దీనిపై దర్యాప్తు చేసిన CBI పందేర్, కోలి హత్యాచారాలకు పాల్పడ్డారని తేల్చింది. అయితే కోర్టుల్లో నిరూపించలేకపోయింది.
News November 11, 2025
టమాటాలో బాక్టీరియా ఎండు తెగులును ఎలా నివారించాలి?

బాక్టీరియా ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పీకి దూరంగా తీసుకెళ్లి కాల్చివేయాలి. మొక్కను తొలగించిన చోట వెంటనే బ్లీచింగ్ పౌడర్ చల్లాలి. ఇలా చేయడం వల్ల బాక్టీరియా ఇతర మొక్కలకు సోకదు. టమాటా నారును నాటుకునే ముందే వేపపిండిని నేలలో చల్లుకోవడం వల్ల ఈ తెగులు వృద్ధి చెందకుండా చేసుకోవచ్చు. తెగులు సోకిన మొక్కలు పొలంలో ఉన్నప్పుడు నీటి తడులు ఇస్తే ఈ తెగులు ఉద్ధృతి మరింత పెరిగి నివారణ కష్టమవుతుంది.
News November 11, 2025
స్టాక్ మార్కెట్లో LIC ₹16 లక్షల కోట్ల పెట్టుబడి

LIC అంటే తెలియని వారుండరు. ఇందులో అనేకమంది భాగస్వామ్యం ఉంది. వారి సొమ్ము లక్షల కోట్లు ఇందులో ఉన్నాయి. ఇలా వచ్చిన సొమ్మును సంస్థ పలు రంగాల్లో పెట్టుబడులుగా పెడుతోంది. ఇలా ఇప్పటివరకు ₹16 లక్షల కోట్లు పెట్టింది. తాజాగా HDFC, ICICI వంటి ప్రయివేటు బ్యాంకుల షేర్లను విక్రయించి SBIలో పెట్టుబడి పెట్టింది. ఇటీవల అదానీ కంపెనీలో పెట్టుబడి పెట్టగా విమర్శలు రావడంతో స్వయంగానే నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది.


