News January 25, 2025

పెద్దపల్లి: ఆర్మీ ప్రవేశ శిక్షణ కొరకు దరఖాస్తుల స్వీకరణ

image

ఆర్మీ ప్రవేశ పరీక్షలకు శిక్షణ కోసం ఆసక్తి గలవారు ఫిబ్రవరి 10 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉచిత వసతితో కూడిన శిక్షణా అందిస్తున్నామన్నారు. Feb2004-Aug2007 మధ్య జన్మించిన వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 8309435264, 8333044460, 9573688952 నంబర్లను లేదా మీ గ్రామ పంచాయతీ కార్యదర్శి / సమీప పోలీస్ స్టేషన్ ఎస్ఐని సంప్రదించాలని సూచించారు.

Similar News

News November 9, 2025

ఆడపిల్ల పెళ్లికి రూ.65వేల సాయం: యోగి

image

యూపీలో భవన నిర్మాణ కార్మికులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. ‘కన్యా వివాహ్ సహాయతా యోజన’ కింద ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సాయం చేయనుంది. సాధారణ వివాహానికి రూ.65వేలు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజీకి రూ.75వేలు, సామూహిక వివాహాలకు రూ.85వేలు ఇవ్వనుంది. వీటితో పాటు వేడుక ఖర్చులకు రూ.15వేలు అదనంగా అందించనుంది. భవన నిర్మాణ కార్మికులు సమాజానికి వెన్నెముక అని యోగి కొనియాడారు.

News November 9, 2025

జూబ్లీహిల్స్ పోటీలో నలుగురు మహిళా అభ్యర్థులు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 58 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ఇందులో నలుగురు మహిళలు ఉన్నారు. వీరిలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్‌తో పాటు సోషలిస్ట్ పార్టీ నుంచి సుభద్రారెడ్డి, ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇంక్విలాబ్-ఏ-మిల్లత్ నుంచి షేక్ రఫత్ జహాన్, స్వతంత్ర అభ్యర్థి అస్మా బేగం పోటీ చేస్తున్నారు. నలుగురు అభ్యర్థుల్లో అస్మాబేగం పిన్న వయస్కురాలు.

News November 9, 2025

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు పీజీఆర్ఎస్‌ రద్దు

image

విశాఖ సీపీ కార్యాలయంలో రేపు జరగబోయే పీజీఆర్ఎస్‌ను రద్దు చేసినట్లు సీపీ శంక బ్రత బాగ్చి తెలిపారు. జిల్లా పోలీస్ యంత్రాంగం CII పార్ట్‌నర్ షిప్ సమ్మిట్ ఏర్పాట్లలలో, భద్రత చర్యలలో ఉన్నందున PGRSను తాత్కాలికంగా రద్దు చేసామన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని సీపీ కోరారు. అలాగే జీవీఎంసీలో కూడా రేపు పీజీఆర్ఎస్‌ రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు.