News March 18, 2024
KMM: అడుగంటుతున్న పాలేరు జలాశయం!

పాలేరు జలాశయం వేసవి ప్రారంభంలోనే అడుగంటుతోంది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఉన్న ఈ జలాశయం.. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, సూర్యాపేట జిల్లాలకు తాగునీటి ఆదరువు. ఎండలు తీవ్రమైతే దీనిపై ఆధారపడిన ఈ జిల్లాల ప్రజలకు తాగునీటి కష్టాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ప్రస్తుతం నిల్వ ఉన్న నీళ్లు కూడా మార్చి నెలలో పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితులున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
Similar News
News January 21, 2026
ఖమ్మం: అనారోగ్యంతో సర్పంచ్ మృతి

ఖమ్మం జిల్లా సింగరేణి మండలం బోటి తండా గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్య తులసిరాం(45)అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో తులసీరామ్ ఏకగ్రీవంగా బోటితండా సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అనారోగ్యానికి గురి కావడంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. తులసీరామ్ మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.
News January 21, 2026
ఖమ్మం ఆర్టీసీకి రూ.19.80 కోట్ల ఆదాయం

సంక్రాంతి సందర్భంగా ఖమ్మం రీజియన్‌లో రికార్డు స్థాయిలో రూ.19.80 కోట్ల ఆదాయం సమకూరిందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ నెల 9 నుంచి 19 వరకు ఏడు డిపోల పరిధిలో 1,483 అదనపు సర్వీసులను నడిపామని తెలిపారు. డిపో మేనేజర్లు, సిబ్బంది సమన్వయంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సురక్షితంగా చేరవేశామని, అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని ఆర్టీసీ యంత్రాంగం పేర్కొంది.
News January 21, 2026
జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్ అనుదీప్

జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 30 జంక్షన్ల వద్ద పటిష్ఠ చర్యలు చేపట్టాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో రోడ్డు భద్రత కమిటీతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ప్రధాన రహదారులు, జంక్షన్ల వద్ద ప్రమాదాల నివారణకు చేపట్టిన పనుల పురోగతిని పరిశీలించారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ప్రతి జంక్షన్ వద్ద ప్రత్యేక నిఘా, మౌలిక వసతులు కల్పించాలని స్పష్టం చేశారు.


