News January 25, 2025
ఒకే నెలలో కొండగట్టు ఆలయానికి ముగ్గురు ఈవోలు

కొండగట్టు అంజన్న ఆలయ ఈఓగా ఇవాళ ఉప కమిషనర్ కృష్ణ ప్రసాద్ అదనపు బాధ్యతలు స్వీకరించారు. అయితే ఇదే నెలలో ముగ్గురు కొండగట్టు ఈఓలుగా బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఇక్కడి ఈఓ రామకృష్ణ బదిలీపై వెళ్లగా వేములవాడ ఈఓ వినోద్ రెడ్డికి అదనపు బాధ్యతలు కల్పించారు. తర్వాత శ్రీకాంత్ రావు వరంగల్ ను నియమిస్తూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయగా, బాధ్యతలు చేపట్టి సెలవుపై వెళ్ళారు. దీంతో కృష్ణ ప్రసాద్‌ను నియమించారు.
Similar News
News March 14, 2025
వికారాబాద్: ‘పండుగ పేరుతో హద్దులు దాటొద్దు’

హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు చల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్త పరుస్తారు. అయితే కొందరు ఆకతాయిలు పండగ పేరుతో హద్దు మీరి ఇతరులను ఇష్టం వచ్చినట్లు తాకి రంగులు పూయడం చేస్తారు. ఎదుటివారి ఇష్టంతో మాత్రమే రంగులు చల్లడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా తెలియని వారి విషయంలో దూరంగా ఉంచుతూ హుందాగా వ్యవహరించాలని, పండగ వాతావరణాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు తెలిపారు.
News March 14, 2025
సూపర్ ఐడియా కదా..!

AP: రోడ్డు ప్రమాదాల నివారణకు పల్నాడు జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ ఆదేశాలతో ‘ఫేస్ వాష్ అండ్ గో’ ప్రోగ్రామ్ చేపట్టారు. అర్ధరాత్రి తర్వాత వాహనాలను ఆపి డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగిస్తున్నారు. నిద్రమత్తు వల్లే ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ కార్యక్రమం ద్వారా ప్రమాదాలు తగ్గుతాయని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ ప్రోగ్రామ్ చేపడితే ఎంత బాగుంటుందో కదా!
News March 14, 2025
సంగారెడ్డి: గుండెపోటుతో యువకుడి మృతి

హత్నూర మండలం శేరుకంపల్లికి చెందిన దండు శివకుమార్(28) నిన్న అర్ధరాత్రి గుండెపోటుతో చనిపోయారు. స్థానికుల వివరాలిలా.. సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్న శివ.. గురువారం రాత్రి ఇంట్లో గుండెపోటుకు గురై మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎమార్పీఎస్ నాయకులుగా పనిచేస్తూ సమాజ సేవ చేసేవారని స్థానికులు తెలిపారు. అందరితో కలిసి మెలిసి ఉండే శివ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది.