News January 25, 2025
వికారాబాద్: రేపటి నుంచి 4 సంక్షేమ పథకాలు అమలు: కలెక్టర్

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశ పెట్టిన రైతు భరోసా ఇందిరమ్మ ఇళ్ళు, ఆహార బద్రత(రేషన్) కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు, ఆత్మీయ బరోసా పథకాలకు ఆదివారం స్వీకారం చుట్టడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. శనివారం రాష్ట్ర సచివాలయం నుంచి సీఎస్ శాంతకుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అమలుకు చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News January 17, 2026
ఏలూరు: రాజకీయ అండతో నీరుగారిన ‘రేవ్ పార్టీ’ కేసు!

గణపవరం మండలంలో కలకలం రేపిన రేవ్ పార్టీ ఉదంతం రాజకీయ ఒత్తిళ్లతో పక్కదారి పట్టింది. పోలీసులు దాడి చేసి ప్రముఖులను అదుపులోకి తీసుకున్నా, నియోజకవర్గ ముఖ్య నేత జోక్యంతో కేసు నీరుగారిందనే విమర్శలు వస్తున్నాయి. తీవ్రమైన రేవ్ పార్టీ కేసును కాస్తా, కిందిస్థాయి అధికారుల సాయంతో సాధారణ జూదం కేసుగా మార్చడం జిల్లాలో చర్చనీయాంశమైంది. అక్రమార్కులకు రాజకీయ అండ దండలపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
News January 17, 2026
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.380 పెరిగి రూ.1,43,780కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,31,800 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4వేలు పెరిగి రూ.3,10,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి
News January 17, 2026
పాలమూరు: మందుబాబులు తగ్గేదేలే..!

సంక్రాంతి పండుగ సందర్భంగా నాలుగు రోజుల్లో ఉమ్మడి MBNR జిల్లా వ్యాప్తంగా రూ.64.9 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. జనవరి 12న రూ.9.56 కోట్లు, 13న రూ.8.66 కోట్లు, 14న రూ.9.87 కోట్లు, 16న రూ.11.81 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 227 మద్యం దుకాణాల ద్వారా ప్రభుత్వానికి ఈ ఆదాయం లభించినట్లు పేర్కొన్నారు.


