News January 25, 2025

రేపు కాట్నపల్లి గ్రామంలో సంక్షేమ పథకాలు ప్రారంభం

image

రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న నాలుగు పథకాలను ప్రారంభించనుంది. పెద్దపల్లిలో నియోజకవర్గంలో భాగంగా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి రేపు పథకాలను ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరవుతారు. రిపబ్లిక్ డే సందర్భంగా ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు వంటి పథకాలను అమలు చేయనున్నారు.

Similar News

News September 18, 2025

KNR: జిల్లాస్థాయి “కళోత్సవ్” పోటీల్లో కలెక్టర్

image

KNR జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి కళోత్సవ్ పోటీలను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోని విద్యార్థులకు ఈ కళా పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, కథ, దృశ్య కళలు వంటి 12కేటగిరీల్లో పోటీలు జరుగుతున్నాయన్నారు. మండలస్థాయి పోటీల్లో గెలుపొందిన వారికి బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో జిల్లాస్థాయి పోటీలు ప్రారంభించారు.

News September 18, 2025

గుండ్లవాగులో ఘనంగా బతుకమ్మ వేడుకలు!

image

పువ్వుల పండుగకు వేలయ్యింది. ములుగు జిల్లా కేంద్రంలోని తోపుకుంట, రామప్ప జంగాలపల్లి, ఏటూరునాగారంలోని బొడ్రాయి, రామాలయం, బస్టాండ్ తాడ్వాయిలోని మేడారం, కాల్వపల్లి, మంగపేటలోని రాజుపేట, తిమ్మంపేట, గోవిందరావుపేటలోని పస్రా, గుండ్లవాగు, రాళ్లవాగు, దెయ్యాలవాగు, వెంకటాపురంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం, కన్నాయిగూడెం-రామాలయం, వాజేడులోని బొగత వద్ద బతుకమ్మ వేడుకలు జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయి?

News September 18, 2025

భూపాలపల్లిలో పువ్వుల పండుగ జరిగేది ఇక్కడే..!

image

ఈనెల 21 నుంచి ప్రారంభమయ్యే బతుకమ్మ సంబరాలకు భూపాలపల్లి జిల్లా సిద్ధం అవుతోంది. రసంకుంట(గోరి కొత్తపల్లి), గణపేశ్వరాలయం(గణపసముద్రం), మామిడి కుంట చెరువు(చిట్యాల), దామెర చెరువు(రేగొండ), నైన్‌పాక ఆలయం(చిట్యాల), అయ్యప్ప దేవాలయం(కాటారం), టెకుమట్ల చెరువు, కాళేశ్వరం(మహదేవపూర్)తో పాటు పలిమెల, మల్హర్ మండలాల్లోని పలు చోట్ల వేడుకలు ఘనంగా జరుగుతాయి. మీ గ్రామంలో వేడుకలు ఎక్కడ జరుగుతాయో లొకేషన్ కామెంట్ చేయండి.