News January 25, 2025
అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్‌కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్‌కు ఈ గౌరవం దక్కింది.
Similar News
News November 4, 2025
హనుమకొండ: భూ కబ్జాకు యత్నం.. ఇద్దరి అరెస్టు

HNK జిల్లా కాకతీయ యూనివర్సిటీ శివారులో భూకబ్జా యత్నం కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుండ్లసింగారం సర్వే నంబర్ 1/1లో తన భూమిని మహ్మద్ ఇబ్రహీం, లింగంపల్లి నేతాజీలు కబ్జా చేయాలని ప్రయత్నిస్తున్నారని బాధితుడు బిత్తిని వేణుగోపాలరావు ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు జరిపారు. విచారణలో నిందితుల ప్రమేయం తేలడంతో వారిని అదుపులోకి తీసుకుని రిమాండుకు పంపినట్లు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు తెలిపారు.
News November 4, 2025
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుంది: శ్రీనివాస వర్మ

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేంద్రం విరమించుకుందని కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ చెప్పారు. ప్రైవేటీకరణ చేయాలనుకునే ప్రభుత్వం రూ.11,440 కోట్ల ఆర్థిక సహాయం ఎందుకు ప్రకటిస్తుందని ప్రశ్నించారు. నక్కపల్లిలో మిట్టల్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి డిసెంబర్‌లో శంకుస్థాపన జరగనున్నట్టు వెల్లడించారు. తాళ్లపాలెంలో NCL ఇండస్ట్రీస్ లిమిటెడ్ కొత్త సిమెంట్ గ్రైండింగ్ ప్లాంట్‌ను ప్రారంభించారు.
News November 4, 2025
గుంటూరు మిర్చీ యార్డులో 37,640 టిక్కీలు అమ్మకం

గుంటూరు మిర్చి యార్డుకు సోమవారం 40,415 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక ఓ ప్రకటనలో తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 37,640 అమ్మకం జరిగినట్లు చెప్పారు. ఇంకా యార్డు ఆవరణలో 7,834 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు రకాలుగా నమోదయ్యాయన్నారు.


