News March 18, 2024
చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడేవాడిని: అశ్విన్

ఓ దశలో క్రికెట్‌ను వదిలేద్దామని అనుకున్నానని టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్ వెల్లడించారు. “గతంలో సరైన అవకాశాలు లేనప్పుడు మానసిక ఒత్తిడికి లోనయ్యా. ఓసారి ఇంట్లో నాన్నతో ఏదో గొడవైనప్పుడు ఆయన ‘నీకు నిజాయతీ ఎక్కువ అందుకే నష్టపోతున్నావ్’ అని అనేశారు. సాధారణంగా ఎప్పుడూ అంత బాధపడను. కానీ అప్పుడు గదిలోకి వెళ్లి గంటల తరబడి ఏడ్చాను. కొంతకాలం అలా చీకటి గదిలో ఒంటరిగా ఉంటూ బాధపడ్డాను” అని తెలిపారు.
Similar News
News April 2, 2025
ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి

AP: విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి(43) మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుడిని నవీన్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
News April 2, 2025
కంచ గచ్చిబౌలి భూములపై నివేదిక కోరిన కేంద్రం

TG: కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై వాస్తవిక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర అటవీశాఖను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అటవీ చట్టానికి లోబడి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. కోర్టులు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించలేదన్న విషయాన్ని నిర్ధారించుకోవాలని పేర్కొంది.
News April 2, 2025
ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయొచ్చుగా..!

భారీగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. అత్యవసరమై మండుటెండలో బయటకు వస్తే సిగ్నల్స్ వద్ద ఉడికిపోవాల్సి వస్తోంది. ఈక్రమంలో వాహనదారులకు ఉపశమనం కలిగించేందుకు ఒడిశాలోని భువనేశ్వర్ మున్సిపల్ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ క్లాత్‌తో తాత్కాలిక టెంట్ ఏర్పాటు చేశారు. ఇలాంటివి మన వద్దా ఏర్పాటు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.