News January 25, 2025
పాడేరు: బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు అందుకున్న కలెక్టర్

జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ కు 2024 సంవత్సరానికి బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ ను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విజయానంద్ చేతుల మీదుగా తీసుకున్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం వేడుకలలో ఈ అవార్డును కలెక్టర్ తీసుకున్నారు. గత ఏడాది ఓటర్ల జాబితా తయారీలో, సమ్మరీ రివిజన్ లో విశేష కృషి చేసినందుకు కలెక్టర్‌కు ఈ అవార్డును అందుకున్నారు.
Similar News
News July 5, 2025
ఆస్పత్రి నుంచి కేసీఆర్ డిశ్చార్జ్

TG: మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన HYDలోని నందినగర్ నివాసానికి చేరుకున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఉండనున్నారు. ఇటీవల అస్వస్థతకు గురైన కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే.
News July 5, 2025
JGTL: ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను రక్షించిన పోలీసులు

మంచిర్యాల్ జిల్లా చున్నంబట్టివాడకు చెందిన కొమిరి రజిత కుటుంబ కలహాల నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. జగిత్యాల (D) ధర్మపురి మండలంలోని రాయపట్నం గోదావరి బ్రిడ్జి వద్దకు వచ్చిన రజిత బ్రిడ్జి పైనుంచి దూకేందుకు యత్నించింది. ఆ సమయంలో చెక్‌పోస్ట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న ధర్మపురి పోలీస్ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుళ్లు స్పందించి సమయస్ఫూర్తితో అడ్డుకొని ఆమెను కాపాడారు.
News July 5, 2025
తల్లిదండ్రులకు విద్యార్థినుల అప్పగింత

తుని మండలం గవరయ్య కోనేరు వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థునులు తెల్లవారుజామున 3గంటల ప్రాంతంలో హాస్టల్ నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న టౌన్ పోలీసులు వీరిని హైవే రోడ్డుపై గురించి వారి తల్లిదండ్రులు, కళాశాల ప్రిన్సిపల్‌కు సమాచారం అందించారు. అనంతరం విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.