News January 26, 2025

‘పద్మ’గ్రహీతలకు అభినందనలు: చిరంజీవి

image

‘పద్మ’ పురస్కారాలు గెలుచుకున్న తెలుగువారికి మెగాస్టార్ చిరంజీవి ట్విటర్లో అభినందనలు తెలిపారు. ‘పద్మవిభూషణ్ గెలుచుకున్న డాక్టర్ నాగేశ్వరరెడ్డికి, పద్మభూషణ్ పొందిన నా స్నేహితులు నందమూరి బాలకృష్ణ, అజిత్ కుమార్, శ్రీ అనంత నాగ్, శేఖర్ కపూర్, శోభన, పద్మశ్రీ వచ్చిన అర్జిత్ సింగ్, మాడుగుల నాగఫణిశర్మ సహా పద్మ అవార్డీలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు.

Similar News

News January 7, 2026

డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్‌లో ఇంటర్న్‌షిప్

image

DRDOకు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైకాలజికల్ రీసెర్చ్‌ 8 పెయిడ్ ఇంటర్న్‌షిప్‌ల కోసం దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 25 వరకు అప్లై చేసుకోవచ్చు. పీజీ(సైకాలజీ) ఫైనల్ ఇయర్, B.TECH/BE(CSE) ఫైనల్ ఇయర్ చదువుతున్నవారు అర్హులు. అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.5వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.drdo.gov.in

News January 7, 2026

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో వెండి ధర భారీగా పెరిగింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.12,000 పెరిగి రూ.2,83,000కు చేరింది. మూడు రోజుల్లోనే రూ.26వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర ఇవాళ రూ.660 పెరిగి రూ.1,39,480గా ఉంది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.600 ఎగబాకి రూ.1,27,850 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News January 7, 2026

ఢిల్లీ పొల్యూషన్.. రెండో రాజధానే సొల్యూషనా?

image

పొల్యూషన్‌కు పర్యాయపదంగా ఢిల్లీ మారిపోయింది. దీంతో ప్రజలు ఆరోగ్యపరంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. దేశ పరిపాలనా వ్యవహారాలకూ ఇబ్బంది కలుగుతోంది. హరియాణా, పంజాబ్‌లలో పంట వ్యర్థాల కాల్చివేతలతోపాటు లెక్కకుమించిన వాహనాలూ కాలుష్యానికి కారణమవుతున్నాయి. దీంతో దక్షిణాదిలో రెండో రాజధాని ఏర్పాటు వాదన బలపడుతోంది. దీనివల్ల ఢిల్లీపై ఒత్తిడి తగ్గుతుందంటున్నారు. మరి ఏ నగరం రెండో రాజధానికి అనుకూలం? కామెంట్