News January 26, 2025
ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఆదాయ వివరాలు

ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం రూ.1,96,549 ఆదాయం సమకూరినట్లు ఆలయాధికారులు తెలిపారు. అందులో వివిధ కార్యక్రమాలు టికెట్లు అమ్మకం ద్వారా రూ.75,680, ప్రసాదాల అమ్మకం ద్వారా రూ.75,680, అన్నదానం రూ.20,591,వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు.
Similar News
News September 17, 2025
HYD: ప్రజావసరాలకు అనుగుణంగా పనిచేయాలి: రంగనాథ్

హైడ్రాలో ఘనంగా ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. ప్రజల అవసరాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలని దిశా నిర్దేశం చేశారు. ప్రజల బాధలను అర్థం చేసుకొని సమస్యలను పరిష్కరించే విధంగా అందరూ పనిచేయాలని సూచించారు.
News September 17, 2025
పాక్ ‘ఫేక్ ఫుట్‌బాల్ జట్టు’ను వెనక్కి పంపిన జపాన్

ఫుట్‌బాల్ ఆటగాళ్లమంటూ పాక్ నుంచి తమ దేశానికి వచ్చిన ఫేక్ ప్లేయర్లను జపాన్ వెనక్కి పంపింది. మాలిక్ వకాస్ అనే వ్యక్తి ఫేక్ ఫుట్‌బాల్ జట్టును సృష్టించి 22 మందిని జపాన్‌కు పంపించాడు. అయితే అక్రమంగా వచ్చిన వారిని అధికారులు హెచ్చరించి వెనక్కి పంపించారు. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సైతం నిర్ధారించింది. వకాస్‌ను అరెస్ట్ చేసి విచారించగా 2024లోనూ ఇదే పద్ధతిలో పంపినట్లు తెలిపాడు.
News September 17, 2025
పోలీస్ కమిషనరేట్‌లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ సన్ ప్రీత్ సింగ్ కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్‌తో పాటు, ఏసీపీలు ఆర్.ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్ఐలు ఇతర పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.