News January 26, 2025
నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా
మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News January 27, 2025
రేపు నల్గొండకు KTR
నల్గొండకు మంగళవారం BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్లు BRS పార్టీ ముఖ్యనేతలు తెలిపారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి నల్గొండకు చేరుకుంటారన్నారు. క్లాక్ టవర్ వద్ద జరిగే రైతు మహాసభలో ఆయన పాల్గొంటారన్నారు. కాగా, కోర్టు అనుమతితో రేపు నల్లగొండలో రైతు మహాధర్నాను బీఆర్ఎస్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
News January 27, 2025
NLG: రైతు మహాధర్నా సభ ఏర్పాట్ల పరిశీలన
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం నల్గొండలో పాల్గొనే ధర్నా కార్యక్రమం ఏర్పాట్లను క్లాక్ టవర్ సెంటర్లో సోమవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యేలు రామావత్ రవీంద్ర కుమార్, గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డిలు పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఒంటెద్దు నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షుడు బోనగిరి దేవేందర్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి పాల్గొన్నారు.
News January 27, 2025
నల్గొండ: ‘నెలాఖరులోగా రైతుభరోసా దరఖాస్తుల పరిష్కారం’
పాతబడిన అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక వైద్యారోగ్యకేంద్రాలు, ఏరియా ఆసుపత్రుల స్థానంలో నూతన భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఆమె జిల్లా అధికారుల సమ్మిలిత సమావేశంలో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుంచి ప్రారంభించిన రైతు భరోసా పెండింగ్ దరఖాస్తులన్నింటినీ నెలాఖరులోగా పరిష్కరించాలన్నారు.