News January 26, 2025
నేడు మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు: ఏసీపీ

గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదివారం మద్యం విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని సెంట్రల్ ఏసీపీ దామోదర్ హెచ్చరించారు. శనివారం ఆయిన మీడియాతో మాట్లాడుతూ.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మద్యం విక్రయాలు జరిపే వారిపై కేసులు నమోదు చేస్తామన్నారు. బెల్ట్ షాపు నిర్వహించిన మద్యం విక్రయాలు జరిపిన తమకు సమాచారం అందించాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఏసీపీ తెలిపారు.
Similar News
News September 17, 2025
MTM: YS జగన్ ఫొటోలతో సర్టిఫికేట్లు.. ఉద్యోగులు సస్పెండ్

బందరు మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిథిలో మాజీ సీఎం జగన్ ఫొటోతో ఉన్న కుల, ఆదాయ సర్టిఫికేట్లు జారీ చేసిన ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన సచివాలయం డిజిటల్ అసిస్టెంట్ పెద్దింట్లమ్మ, పంచాయతీ కార్యదర్శి రవి శంకర్‌లను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
News September 17, 2025
HYD: 3 రోజులుగా అశోక్ ఆమరణ దీక్ష..!

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ సెప్టెంబర్ 15వ తేదీన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించగా, నేడు మూడో రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు అందిస్తామని నిరుద్యోగులను మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, తక్షణమే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.
News September 17, 2025
ఆదిలాబాద్: రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోంది: ఎస్పీ

తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి దిశగా సాగుతోందని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. ఆదిలాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. 1948 సెప్టెంబర్ 17వ తేదీన నిజాం నియంత పాలన అంతమైందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృతనిశ్చయంతో విధులు నిర్వహించాలన్నారు.