News March 18, 2024
రెండో రోజు కవిత ఈడీ విచారణ
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రెండో రోజు BRS ఎమ్మెల్సీ కవిత విచారణ ప్రారంభమైంది. రూ.100 కోట్ల ముడుపుల వ్యవహారం, ఇతర నిందితుల వాంగ్మూలాలపై ఆమెను అధికారులు ప్రశ్నిస్తున్నారు. అటు ఇవాళ్టి విచారణకు తాము హాజరుకావడం లేదని ఇటీవల నోటీసులు అందుకున్న కవిత భర్త అనిల్, వ్యక్తిగత సిబ్బంది ఈడీకి బదులిచ్చారు. ఇక కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో రేపు విచారణ జరగనుంది.
Similar News
News January 6, 2025
ఈనెల 25లోపు రెండో విడత కాటమయ్య కిట్లు: మంత్రి
TG: కల్లు గీత కార్మికులకు రెండో విడతలో భాగంగా 10 వేల కాటమయ్య రక్షణ కవచం కిట్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 25లోపు పంపిణీ పూర్తి చేస్తామన్నారు. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 15 వేల మందికి కిట్లు ఇచ్చామని తెలిపారు. గత ఏడాది జులై 14న రంగారెడ్డి (D) లష్కర్ గూడలో సీఎం రేవంత్ కాటమయ్య కిట్ల పంపిణీని ప్రారంభించిన సంగతి తెలిసిందే.
News January 6, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం
TG: ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి ఎకరానికి రూ.12వేలు అందుతాయి.
News January 6, 2025
రైతు భరోసా: బీడు భూములు గుర్తించేందుకు సర్వే!
TG: వ్యవసాయ భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించనుంది. వ్యవసాయ, పంచాయతీ రాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు సమాచారం. సర్వే నంబర్ల వారీగా గుట్టలు, వెంచర్ల లిస్ట్ రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం సాగు లెక్కలను ప్రామాణికంగా తీసుకుని పథకానికి కావాల్సిన నిధులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.