News January 26, 2025
నల్లగొండ: MGU మూడో సెమిస్టర్ పరీక్షలు వాయిదా

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జనవరి 30 నుంచి జరగాల్సిన పీజీ లా & ఎంసీఏ పరీక్షలను ఫిబ్రవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు సీఓఈ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన పోటీ పరీక్షల కారణంగా అకడమిక్ పరీక్షల కోసం సమాయత్తానికి కొంత సమయం కావాలంటూ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
Similar News
News February 27, 2026
HYD: ఆ రోజు ఆలయాలు బంద్!

చంద్రగ్రహణం దృష్ట్యా మార్చి 3న కడ్తాల్‌లోని మైసిగండి మైసమ్మ ఆలయంతో పాటు శివాలయ, రామాలయాలు మూసివేస్తున్నట్లు ఆలయ ఈవో స్నేహలత చెప్పారు. మూడో తేదీ ఉదయం ఏడు గంటల నుంచి 4వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఆలయాలను మూసివేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఆలయ శుద్ధి, అభిషేకం, అలంకరణ అనంతరం భక్తుల దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. గ్రహణం దృష్య్టా నగరంలోని ప్రముఖ ఆలయాలను సైతం మూసివేయనున్నారు.
SHARE IT
News February 27, 2026
వావ్.. వరంగల్ నగరం ఎంత బాగుంది: ఎంపీ కావ్య

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24 అంతస్తుల భవనం పైనుంచి చూస్తే వరంగల్ నగరం ఎంతో బాగుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను నేడు సందర్శించిన సందర్భంగా కలెక్టర్ సత్య శారదతో కలిసి లిఫ్టులో 24 అంతస్తుల ఆస్పత్రి భవనంలోని అన్ని ఫ్లోర్లలో తిరిగారు. చివరన 24 అంతస్తుల పైభాగానికి వెళ్లి నగరాన్ని చూస్తూ సంబరపడ్డారు.