News January 26, 2025
PPM: గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం

ఆదివారం స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో జరగబోయే 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. వేదికతో పాటు ఆవరణ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. ఆదివారం ఉదయం 9కి ముఖ్యఅతిథి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ చే జాతీయ పతాక ఆవిష్కరణతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. పోలీసుల కవాతు, మార్చ్ ఫాస్ట్ తదుపరి జిల్లా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ సందేశం చదివి వినిపిస్తారు.
Similar News
News September 13, 2025
ఈనెల 14న ఎన్డీఏ, సీడీఎస్ పరీక్షలు: డీఆర్ఓ

UPSC ఆధ్వర్యంలో ఈనెల 14న నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ పరీక్షలు జరుగుతాయని DRO మాలోలా తెలిపారు. రెండు కేంద్రాలలో 252 మంది అభ్యర్థులు హాజరవుతారు. UPSC నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు పగడ్బందీగా నిర్వహిస్తామన్నారు. JNTU, KSN ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు జరుగుతాయన్నారు.
News September 13, 2025
ఈమె తల్లి కాదు.. రాక్షసి

TG: ప్రియుడి కోసం కన్నకూతురినే గొంతునులిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్(D) శభాష్‌పల్లికి చెందిన మమతకు భాస్కర్‌తో వివాహం కాగా పిల్లలు చరణ్(4), తనుశ్రీ(2) ఉన్నారు. భాస్కర్‌తో కలిసి ఉండలేనంటూ పుట్టింటికి వెళ్లిన ఆమెకు ఫయాజ్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొడుకును తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకొని ప్రియుడితో వెళ్లిపోయింది. అదేరోజు తనుశ్రీని గొంతునులిమి చంపి గ్రామ శివారులో పాతిపెట్టింది.
News September 13, 2025
HYD: స్పాట్ అడ్మిషన్లకు దరఖాస్తులు

మాసబ్‌ట్యాంక్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో డీ-ఫార్మసీ కోర్సులో స్పాట్ అడ్మిషన్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు. దోస్త్ ప్రక్రియ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఈ నెల 16న ఉదయం 10 గంటలకు జరిగే అడ్మిషన్ ప్రక్రియకు హాజరుకావాలని పేర్కొన్నారు.