News January 26, 2025

ఓయూలో బీఈడీ పరీక్షా ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని బీఈడీ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షా ఫీజును మార్చి 4వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.200 అపరాధ రుసుముతో 6వ తేదీ వరకు చెల్లించవచ్చన్నారు. ఈ పరీక్షలను మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Similar News

News October 30, 2025

జనగామ కలెక్టర్‌ను కలిసిన డీపీఓ

image

జనగామ జిల్లా పంచాయతీ అధికారిగా ఎ.నవీన్ గురువారం కలెక్టరేట్లోని డీపీఓ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషాను మర్యాదపూర్వకంగా కలిశారు. బాధ్యతలు స్వీకరించిన ఆయనకు కలెక్టరేట్ అధికారులు, డీపీఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన కార్యాలయ సిబ్బందితో సమావేశమయ్యారు.

News October 30, 2025

మోంథా తెచ్చిన తంటా.. ప్రయాణం గందరగోళం

image

తెలంగాణ వైపు దిశ మార్చుకున్న మోంథా తుపాను హైదరాబాద్ ప్రయాణికులను గందరగోళంలోకి పడేసింది. తుఫాను కారణంగా పలు బస్సులు, రైళ్లు రద్దు కావడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. 2 రోజుల్లో రైల్వే అధికారులు 137 రైళ్లను రద్దు చేశారంటే మోంథా ప్రభావం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా సికింద్రాబాద్- ఖమ్మం- డోర్నకల్- మహబూబాబాద్ రూట్‌లో కురిసిన వర్షం వల్ల అనేక రైళ్లు రద్దయ్యాయి.

News October 30, 2025

కూతురు మృతి: అడుగడుగునా లంచం ఇవ్వలేక..

image

ఒక్కగానొక్క కూతురు(34) అనారోగ్యంతో చనిపోతే.. ఆ తర్వాత అడుగడుగునా లంచం ఇవ్వలేక ఆ తండ్రి కుంగిపోయారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. BPCL మాజీ CFO శివకుమార్ కూతురు ఇటీవల మరణించారు. అయితే అంబులెన్స్ మొదలుకుని FIR, పోస్టుమార్టం రిపోర్టు, అంత్యక్రియలు, డెత్ సర్టిఫికెట్ వరకు లంచం ఇవ్వాల్సి వచ్చిందని అతను SMలో పోస్టు చేసి ఆ తర్వాత డిలీట్ చేశారు. సిస్టమ్‌లోని కరప్షన్‌పై నెటిజన్లు ఫైరవుతున్నారు.