News January 26, 2025
దుద్యాల్: భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తాం: కలెక్టర్

ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణంలో భూ నిర్వాసితులకు ఎకరాకు రూ.20 లక్షలు, 120 గజాల ప్లాటు ఇచ్చి న్యాయం చేస్తామని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో దుద్యాల మండలం లగచర్ల రైతులు కలెక్టర్‌తో సమావేశమయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి రైతుల సమ్మతి లభించిందని కలెక్టర్ తెలిపారు. భూములు కోల్పోతున్న రైతులకు న్యాయం చేస్తామన్నారు.
Similar News
News January 13, 2026
TTD ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం

TTD ఆధ్వర్యంలోని SV బధిర హైస్కూల్, జూనియర్ కళాశాల, ITI, శ్రవణం, బాల మందిరాన్ని ఓకే గొడుగు కిందకు తీసుకురానున్నారు. ప్రస్తుతం విడివిడిగా ఉన్న వీటిని ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ నిర్మాణం చేసి అక్కడ పెట్టేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే అలిపిరి జూపార్క్ రోడ్డులో స్థలం కోసం పరిశీలన చేశారని తెలుస్తోంది. ఆ క్యాంపస్‌కు కావాల్సిన సౌకర్యాలు, సదుపాయాలపై ఇప్పటికే నివేదిక ఆమోదం లభించిందని తెలుస్తుంది.
News January 13, 2026
రేపే మకరజ్యోతి దర్శనం

శబరిమలలో రేపు మకర జ్యోతి దర్శనం ఇవ్వనుంది. సాయంత్రం 6:25-6.55 గంటల మధ్య పొన్నాంబల కొండపై కనిపించనుంది. సాక్షాత్తు మణికంఠుడే ఈ జ్యోతిగా దర్శనమిస్తారని భక్తులు విశ్వసిస్తారు. కాగా రేపు వర్చువల్ క్యూ ద్వారా 30,000 మందికే అనుమతి ఉంది. జ్యోతి దర్శనం నేపథ్యంలో ఇప్పటికే దేవస్వం బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 19 రాత్రి వరకు అయ్యప్ప దర్శనానికి అవకాశం ఉండగా 20వ తేదీన ఆలయం మూసివేయనున్నారు.
News January 13, 2026
ఒంగోలులో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు సస్పెండ్

ఒంగోలులోని యాదవ మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో SGTగా పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాసరావును విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు DEO రేణుక తెలిపారు. ఈ మేరకు DEO కార్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది. ఉపాధ్యాయుడు పాఠశాలలో బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, గైర్హాజరైన విద్యార్థుల అటెండెన్స్ వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నట్లు అందిన నివేదిక మేరకు చర్యలు తీసుకున్నట్లు వెల్లడించారు.


