News January 26, 2025

సూర్యాపేట: సంక్షేమ పథకాల అమలుపై కలెక్టర్ దిశా నిర్దేశం 

image

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత (రేషన్) కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను ఆదివారం నుంచి శ్రీకారం చుడతామని కలెక్టర్ తేజస్ నందు లాల్ పవార్ తెలిపారు.శనివారం సూర్యాపేట కలెక్టర్ సమావేశ మందిరం వేబెక్స్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్ రాంబాబు ఉన్నారు.

Similar News

News October 18, 2025

బుధవారం నుంచి భారీ వర్షాలు: APSDMA

image

AP: మంగళవారం నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ఇది ఆ తదుపరి 48 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో బుధవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. అటు రేపు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించింది.

News October 18, 2025

రేపు రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్: కలెక్టర్

image

వాణిజ్య, వ్యాపార రంగాలకు నూతన ఉత్సాహం నింపే లక్ష్యంతో ‘ది గ్రేట్ రాజమహేంద్రవరం షాపింగ్ ఉత్సవ్’ నిర్వహించనున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి శనివారం రాజమండ్రిలో తెలిపారు. ఈ నెల 19న (ఆదివారం) ఉదయం 10 గంటలకు ఆనంద్ రీజెన్సీ సమీపంలోని పందిరి ఫంక్షన్ హాల్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్‌పై అవగాహన పెంచడం, వ్యాపారంలో ఉత్సాహం నింపడం దీని ముఖ్య ఉద్దేశం అన్నారు.

News October 18, 2025

పెళ్లి పీటలెక్కనున్న స్మృతి మంధానా!

image

భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇండోర్‌కు చెందిన సంగీత దర్శకుడు, సినీ నిర్మాత పలాష్ ముచ్చల్‌తో ఆమె వివాహం జరగనున్నట్లు సమాచారం. ఇటీవల స్మృతి గురించి అడిగిన ప్రశ్నకు పలాష్ ముచ్చల్ స్పందిస్తూ ‘స్మృతి మంధానా త్వరలోనే ఇండోర్ కోడలు కాబోతోంది’ అని వెల్లడించారు. వీరిద్దరూ గత 6 ఏళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లు సమాచారం.