News January 26, 2025

HYD: ఒక కిలోమీటర్ మెట్రోకు రూ.317 కోట్లు..!

image

HYD మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2లో పార్ట్-A కింద 5 మెట్రో కారిడార్ల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (DPR) సిద్ధమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 76.4KM మెట్రోకు రూ.24,269 కోట్ల ఖర్చు అవుతుందని రిపోర్టులో ఉంది. అంటే సుమారు 1KM మెట్రోకు రూ.317 కోట్లు.ఈ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్రం ఆమోదించాలని,కేంద్ర,రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించడానికి నిధులు విడుదల కేటాయించాలని కోరారు.

Similar News

News September 16, 2025

ఇచ్ఛాపురం: అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానం

image

ఇచ్ఛాపురం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒడియా అతిథి అధ్యాపక పోస్ట్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస రావు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 20వ తేదీ లోపు కళాశాలలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సెప్టెంబర్ 22న ఉదయం 10 గం.లకు ఇంటర్వ్యూ ఉంటుందని, MA (ఒడియా)లో 50% మార్కులు, NET, Ph.D అర్హత కలిగిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందని పేర్కొన్నారు.

News September 16, 2025

HYDలో రోడ్డు సేఫ్టీ సమ్మిట్.. ఇలా రిజిస్టర్ చేసుకోండి!

image

HYD సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 18,19వ తేదీలలో ఉ.10 గంటలకు జలవిహార్ వాటర్ పార్క్ వద్ద హైదరాబాద్ ట్రాఫిక్& రోడ్ సేఫ్టీ సమ్మిట్ 2025 నిర్వహించనున్నట్లుగా హైదరాబాద్ సీపీ ఆనంద్ తెలిపారు. పాల్గొనాలనుకునే వారు వెబ్‌సైట్ hcsc.in ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. ప్రముఖులు ఇందులో పాల్గొననున్నారు.

News September 16, 2025

రేపు నల్గొండలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం

image

నల్గొండలో పోలీస్ పరేడ్ మైదానంలో ఈ నెల 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ దినోత్సవాల సందర్భంగా ఉదయం 10 గంటలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరిస్తారన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.