News January 26, 2025
మహ్మద్ షమీకి మళ్లీ మొండిచేయే..!
ఇంగ్లండ్‌తో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టీ20లో స్థానం దక్కకపోయినా రెండో మ్యాచులోనైనా ఆయనను ఆడిస్తారని అంతా భావించారు. కానీ మేనేజ్‌మెంట్ అతడిని పెవిలియన్‌కే పరిమితం చేసింది. దీంతో చాన్నాళ్లకు షమీ బౌలింగ్ చూద్దామనుకున్న అభిమానులకు మరోసారి అసంతృప్తే మిగిలింది. మూడో టీ20లోనైనా ఆయనకు ఛాన్స్ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News January 27, 2025
OTTలోకి వచ్చేస్తున్న ‘పుష్ప-2’
సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న అల్లు అర్జున్ ‘పుష్ప-2’ OTTలోకి వచ్చేస్తోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నెట్‌ఫ్లిక్స్ ‘COMING SOON’ అని ప్రకటించింది. రీలోడెడ్ వెర్షన్(3గం.44ని) అందుబాటులోకి రానుంది. గతేడాది DEC 5న రిలీజైన మూవీ దాదాపు రూ.1900cr రాబట్టింది. 56డేస్ తర్వాత OTTలోకి వస్తుందని ఇప్పటికే మేకర్స్ ప్రకటించగా, JAN 30న స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.
News January 27, 2025
సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధికి ఊరట
తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డెంగ్యూ, మలేరియా వంటి సనాతన ధర్మాన్ని తరిమికొట్టాలని 2023లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే దీనిపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
News January 27, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ ఆ హీరోతో చేస్తా: అనిల్ రావిపూడి
వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సక్సెస్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఒకవేళ తనకు అవకాశం వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ సల్మాన్ ఖాన్‌తో చేస్తానని చెప్పారు. ఈ కథ ఆయనకు బాగా సూట్ అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఇప్పటికే రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.