News January 26, 2025

గూడూరు: ఉత్తమ బీఎల్‌వో అవార్డు అందుకున్న లక్ష్మయ్య

image

గూడూరు మండలం మట్టెవాడ బూత్ లెవెల్ ఆఫీసర్(BLO) హరిబండి లక్ష్మయ్య నేడు ఉత్తమ బీఎల్‌వోగా అవార్డు అందుకున్నారు. మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ అవార్డు అందజేశారు. ఓటర్ల నమోదు, పోలింగ్ సంబంధిత ఏర్పాట్లు చేయడంలో చురుకైన పాత్ర పోషించినందుకు గాను లక్ష్మయ్యకు ఈ గౌరవం దక్కింది. గ్రామస్థులు లక్ష్మయ్యను అభినందించారు.

Similar News

News July 9, 2025

నిమిష మరణ శిక్ష రద్దుకు చివరి మార్గమిదే..

image

హత్య కేసులో కేరళ నర్సు <<16996463>>నిమిషకు<<>> యెమెన్‌ ఈనెల 16న మరణశిక్ష అమలు చేయనుంది. ఆమెకు శిక్ష తప్పాలంటే మృతుడి కుటుంబసభ్యులు క్షమాభిక్ష పెట్టడమే చివరి మార్గం. ఇందుకు 2020 నుంచి మానవ హక్కుల యాక్టివిస్ట్ జెరోమ్ ప్రయత్నిస్తున్నారు. వారికి $1 మిలియన్ పరిహారం, మృతుడి సోదరుడికి UAE లేదా సౌదీలో శాశ్వత నివాసం వంటి ఆఫర్లిచ్చారు. భారత ప్రభుత్వం సహకరిస్తోందని, లేదంటే ఇప్పటికే మరణశిక్ష అమలయ్యేదని జెరోమ్ తెలిపారు.

News July 9, 2025

డ్రాప్ అవుట్ విద్యార్థులు ఓపెన్ స్కూల్‌లో చదవాలి: కలెక్టర్

image

విద్యలో డ్రాప్ అవుట్ అయిన విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్ చేతుల మీదుగా ఓపెన్ స్కూల్ క్యాలెండర్  పోస్టర్ ఆవిష్కరించారు. నిరక్షరాస్యులు ఉల్లాస్ కార్యక్రమంలో భాగస్వాములై అక్షరాస్యులుగా మారాలని కొరారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డీఈఓ జ్ఞానేశ్వర్ పాల్గొన్నారు.

News July 9, 2025

ఆరు బయట చెత్తను వేస్తే.. పరువు పోవడం పక్కా!

image

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దనే ఉద్దేశంతో మున్సిపాలిటీలు ఇంటింటికీ వెళ్లి చెత్తను కలెక్ట్ చేస్తుంటాయి. అయినప్పటికీ కొందరు బయటే చెత్త వేసి ఇతరులను ఇబ్బంది కలగజేస్తుంటారు. అలాంటివారికి బుద్ధి చెప్పాలని గుజరాత్‌లోని వడోదరా మున్సిపాలిటీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్డు పక్కన చెత్త వేసేవారి ఫొటోలను తీసి పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇలా అయినా ప్రజలకు ఈ అలవాటును మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది.