News January 26, 2025

బంగ్లా ఎన్నికల నుంచి హసీనా పార్టీపై నిషేధం

image

మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీని తమ దేశ ఎన్నికల నుంచి నిషేధిస్తున్నట్లు తాత్కాలిక ప్రభుత్వ సలహాదారు మహ్‌ఫూజ్ ఆలం తెలిపారు. ‘బంగ్లా అనుకూల పార్టీలు మాత్రమే ఇకపై ఎన్నికల్లో పాల్గొంటాయి. బీఎన్‌పీ, జమాత్-ఈ-ఇస్లామ్ వంటి పార్టీలే బరిలో ఉంటాయి. ఇవే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయి. సంస్కరణలు పూర్తయ్యే వరకూ మాత్రం దేశంలో ఏ ఎన్నికా జరగదు’ అని స్పష్టం చేశారు.

Similar News

News January 27, 2025

సనాతన ధర్మంపై వ్యాఖ్యలు.. ఉదయనిధికి ఊరట

image

తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. డెంగ్యూ, మలేరియా వంటి సనాతన ధర్మాన్ని తరిమికొట్టాలని 2023లో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ హిందూ సంఘాలు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే దీనిపై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

News January 27, 2025

‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ ఆ హీరోతో చేస్తా: అనిల్ రావిపూడి

image

వెంకటేశ్ హీరోగా తెరకెక్కించిన ‘సంక్రాంతి వస్తున్నాం’ సక్సెస్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మంచి జోష్‌లో ఉన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ఒకవేళ తనకు అవకాశం వస్తే ‘సంక్రాంతికి వస్తున్నాం’ హిందీ రీమేక్ సల్మాన్ ఖాన్‌తో చేస్తానని చెప్పారు. ఈ కథ ఆయనకు బాగా సూట్ అవుతుందని పేర్కొన్నారు. కాగా ఈ మూవీ ఇప్పటికే రూ.260 కోట్లకు పైగా కలెక్షన్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

News January 27, 2025

అంతా ఏక‌ప‌క్ష‌మైన‌ప్పుడు JPC ఎందుకు?: విపక్షాలు

image

వ‌క్ఫ్ సవరణ బిల్లుపై JPCలో విప‌క్షాల ప్ర‌తిపాద‌న‌లను తిర‌స్క‌రించ‌డంపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. NDA స‌భ్యుల 14 ప్రతిపాద‌న‌ల‌ను ఆమోదించి, 44 క్లాజుల్లో తాము ప్రతిపాదించిన వంద‌లాది స‌వ‌ర‌ణ‌లను అజెండా ప్రకారం పక్కనపెట్టేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. క‌మిటీ ఛైర్మ‌న్ పాల్ ప్ర‌జాస్వామ్యానికి బ్లాక్‌లిస్ట‌ర్ అని మండిప‌డుతున్నాయి. అంతా ఏక‌ప‌క్ష‌మైన‌ప్పుడు JPC ఎందుకని ప్రశ్నిస్తున్నాయి.