News January 26, 2025
అన్నమయ్య జిల్లాకు మొదటి స్థానం

సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్‌లో అన్నమయ్య జిల్లా విద్యార్థులు మొదటి స్థానం సాధించారని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి తెలిపారు. ఈనెల 20 నుంచి 25వ తేది వరకు పుదుచ్చేరిలోని ఓల్డ్ పోర్ట్ గ్రౌండ్‌లో సౌత్ ఇండియా సైన్స్ ఫెయిర్ పోటీలు జరిగాయి. అన్నమయ్య జిల్లా కలకడ మోడల్ స్కూల్ విద్యార్థులు మహమ్మద్ సుహేల్, రెహాన్ మొదటి స్థానం కైవసం చేసుకున్నారు.
Similar News
News November 7, 2025
పలమనేరులో Dy. CM పవన్ పర్యటన ఇలా..

ఈ నెల 9వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలమనేరులో పర్యటించనున్నారు. ఉదయం మంగళగిరిలో బయలుదేరి 10 గంటలకు రేణిగుంట ఎయిర్‌పోర్టు, అక్కడి నుంచి 10.35 గంటలకు పలమనేరు మండలం పెంగరగుంట వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేసుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా ముసలిమడుగు కుంకి ఏనుగుల క్యాంప్‌నకు చేరుకుంటారు. పలు కార్యక్రమాల అనంతరం 12.45 గంటలకు బయలుదేరి తిరుపతికి, అక్కడి నుంచి మంగళగిరికి చేరుకుంటారు.
News November 7, 2025
కరీంనగర్: TASKలో బ్యాంకు కోచింగ్!

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని TASK ఆఫీస్‌లో బ్యాంకు కోచింగ్ కోసం శిక్షణ ఇవ్వనున్నట్లు టాస్క్ ప్రతినిధులు తెలిపారు. అర్థమేటిక్, రీజనింగ్, ఇంగ్లిష్, బ్యాంకింగ్, కంప్యూటర్, కోఆపరేటివ్ అవేర్నెస్ సబ్జెక్ట్స్‌లో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు KNR IT టవర్ 1st ఫ్లోర్‌లోని TASK ఆఫీస్‌లో ఈనెల 14లోపు సంప్రదించి రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News November 7, 2025
ములుగు: ‘రైతులను మోసం చేస్తే కేసులు నమోదు చేస్తాం’

రైతులు పండించిన ప్రతి పంటను కొనుగోలు చేయాలని వ్యాపారులను జిల్లా మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ రేగా కళ్యాణి ఆదేశించారు. గురువారం ములుగు కార్యాలయంలో మాట్లాడారు. లైసెన్స్ లేకుండా మార్కెట్ పరిధిలో వ్యాపారం చేయవద్దని హెచ్చరించారు. పంట కొనుగోలు, తూకం విషయంలో రైతులను మోసం చేస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని, సేవలు అందించడమే ముఖ్య లక్ష్యమని తెలిపారు.


