News March 18, 2024
గవర్నర్ తమిళిసై రాజీనామా
TS గవర్నర్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవులకు తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేశారు. తమిళనాడు నుంచి MPగా పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఒక చోట నుంచి బరిలోకి దిగనున్నట్లు తెలుస్తోంది. తిరునల్వేలి, కన్యాకుమారిలో ఆమె సామాజికవర్గ నాడార్ ఓట్లు అధికం. తెలంగాణ గవర్నర్‌గా ఆమె 2019, సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు. KCR ప్రభుత్వ పలు నిర్ణయాలు అడ్డుకుని సంచలనంగా మారారు.
Similar News
News January 6, 2025
GOOD NEWS చెప్పిన ప్రభుత్వం
TG: ఈ నెల 26 నుంచి ప్రభుత్వం రైతు భరోసా నిధులను అన్నదాతల ఖాతాల్లో జమ చేయనుంది. అయితే ఇందుకోసం రైతులు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ, రెవెన్యూ అధికారులు సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే చేసి 10 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. దీని ప్రకారం వ్యవసాయం చేసే భూములకే డబ్బులు అందనున్నాయి. ఈ స్కీం కింద ఏడాదికి ఎకరానికి రూ.12వేలు అందుతాయి.
News January 6, 2025
రైతు భరోసా: బీడు భూములు గుర్తించేందుకు సర్వే!
TG: వ్యవసాయ భూములకే రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, సాగు యోగ్యం కాని భూములను గుర్తించేందుకు జాయింట్ సర్వే నిర్వహించనుంది. వ్యవసాయ, పంచాయతీ రాజ్, రెవెన్యూ ఆధ్వర్యంలో ఫీల్డ్ వెరిఫికేషన్ చేపట్టనున్నట్లు సమాచారం. సర్వే నంబర్ల వారీగా గుట్టలు, వెంచర్ల లిస్ట్ రెడీ చేయనున్నట్లు తెలుస్తోంది. వర్షాకాలం సాగు లెక్కలను ప్రామాణికంగా తీసుకుని పథకానికి కావాల్సిన నిధులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
News January 6, 2025
రాజీనామా చేయనున్న ట్రూడో!
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో లిబరల్ పార్టీ నాయకత్వానికి రాజీనామా చేస్తారని అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఆయన తన పార్టీ ఎంపీల మద్దతును కోల్పోయారని, ఎన్నికలు జరిగితే ఘోరంగా ఓడిపోతారని సర్వేలు సూచిస్తున్నాయని పేర్కొంది. బుధవారం జరిగే కాకస్ సమావేశానికి ముందే ఆయన రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. కొత్త నాయకుడిని ఎన్నుకునే వరకు ట్రూడో ప్రధానిగా కొనసాగే అవకాశం ఉంది.