News January 26, 2025

ముస్తాబైన వనపర్తి కలెక్టరేట్

image

గణతంత్ర దినోత్సవం సందర్భంగా వనపర్తి కలెక్టరేట్ విద్యుత్ దీపాలతో సుందరంగా ముస్తాబ్ చేశారు. నేడు ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆవిష్కరించనున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్ 7:45 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News July 5, 2025

కుర్రాడు ఇరగదీస్తున్నాడు!

image

INDతో టెస్టు సిరీస్‌లో ఇంగ్లండ్ యువ బ్యాటర్ జేమీ స్మిత్ అదరగొడుతున్నారు. రెండో టెస్టు ఫస్ట్ ఇన్నింగ్సులో 207 బంతుల్లోనే 4 సిక్సర్లు, 21 ఫోర్లతో 184 రన్స్ చేశారు. ఎక్కడా తడబడకుండా అటాకింగ్ బ్యాటింగ్‌తో అదుర్స్ అనిపించారు. తొలి టెస్టులో 84 రన్స్ చేశారు. 24 ఏళ్ల స్మిత్ 2019లో ఫస్ట్ క్లాస్ సెంచరీ బాదారు. గతేడాది టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రస్తుతం ఇంగ్లండ్ తరఫున అన్ని ఫార్మాట్లలో ఆడుతున్నారు.

News July 5, 2025

పంచాయతీ ఎన్నికల నిర్వహణపై NRPT కలెక్టర్ సమీక్ష సమావేశం

image

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై కలెక్టర్ సిక్తా పట్నాయక్, అదనపు కలెక్టర్‌తో కలిసి అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. పోలింగ్ కేంద్రాలు, ఎన్నికల సిబ్బందికి శిక్షణ, ఓటర్ల జాబితాలు, భద్రతా ఏర్పాట్లు వంటి వాటిపై అధికారులు దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.

News July 5, 2025

పట్టుబిగించిన భారత్.. లీడ్ ఎంతంటే?

image

ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ పట్టు బిగించింది. మూడో రోజు ఇంగ్లండ్‌ను 407కు ఆలౌట్ చేసిన భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ కోల్పోయి 64 రన్స్ చేసింది. ఆట ముగిసే సమయానికి 244 పరుగుల లీడ్‌లో ఉంది. రాహుల్ 28*, కరుణ్ 7* క్రీజులో ఉన్నారు. అంతకుముందు సిరాజ్ 6, ఆకాశ్ 4 వికెట్లతో చెలరేగారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్మిత్ 184*, బ్రూక్ 158 రన్స్‌తో అదరగొట్టారు.