News January 26, 2025
‘హథిరాంజీ మఠం కూల్చివేతను అడ్డుకుంటాం’

ప్రాణాలను అడ్డుగా పెట్టి తిరుపతి గాంధీ రోడ్డులోని హథీరాంజీ మఠాన్ని కాపాడుకుంటామని టీడీపీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి మబ్బు దేవనారాయణ రెడ్డి అన్నారు. తిరుపతిలోని మఠాన్ని శనివారం సాయంత్రం టీడీపీ నాయకులు పరిశీలించారు. కొంతమంది స్వార్థ ప్రయోజనాలు కోసం పురాతనమైన మఠాన్ని కూల్చివేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. మఠం భవనాల కూల్చివేతతో రూ.కోట్ల నష్టం వస్తుందని చెప్పారు.
Similar News
News December 27, 2025
‘ఆస్తి, ఖాళీ స్థలాల పన్నులను జీవీఎంసీ వెబ్ పోర్టల్ నందు చెల్లించండి’

జీవీఎంసీ పరిధిలో ఇంటి పన్ను, ఖాళీ స్థలాల పన్ను, నీటి పన్ను జీవీఎంసీ యొక్క www. gvmc.gov.in వెబ్సైట్ నందు సులభంగా చేసుకోవచ్చని జీవీఎంసీ అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి శనివారం తెలిపారు. ఈ పోర్టల్ ద్వారా క్రెడిట్, డెబిట్, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా చెల్లించుకోవచ్చు అన్నారు. ఆస్తిపన్ను చెల్లింపుదారులు ఈ సౌకర్యాలను ఉపయోగించుకొని విలువైన సమయం వృథా కాకుండా పన్నులు చెల్లింపు చేయవచ్చు పేర్కొన్నారు.
News December 27, 2025
అనపర్తి రైల్వే స్టేషన్‌లో జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు తాత్కాలిక హల్ట్

విశాఖ నుంచి లింగంపల్లి (12805/12806) వెళ్లే, లింగంపల్లి విశాఖ వచ్చే జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌కు అనపర్తి రైల్వే స్టేషన్‌లో తాత్కాలిక హల్ట్ కల్పించినట్లు వాల్తేర్ డివిజన్ డీసీఎం పవన్ శనివారం తెలిపారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు జనవరి 6 నుంచి ఈ సౌకర్యం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు విషయాన్ని గమనించాలన్నారు.
News December 27, 2025
వార్షిక నేర సమీక్ష.. పెండింగ్ కేసులపై ఎస్పీ ఆరా!

జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శనివారం ఎస్పీ రాహుల్ మీనా అధ్యక్షతన వార్షిక నేర సమీక్షా సమావేశం జరిగింది. జిల్లాలోని పెండింగ్ కేసుల దర్యాప్తు తీరుపై ఆయా డివిజన్ల డీఎస్పీలు, సీఐలు, ఎస్హెచ్ఓలతో ఎస్పీ సుదీర్ఘంగా చర్చించారు. నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా ప్రతి కేసును నిశితంగా పర్యవేక్షించాలని ఎస్పీ స్పష్టం చేశారు.


