News January 26, 2025
అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో డబ్బులు వసూలు..!

అనకాపల్లి జిల్లా ఆసుపత్రిని కలెక్టర్ విజయకృష్ణన్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రసూతి వార్డులో విధులు నిర్వహిస్తున్న మహిళా వైద్యాధికారిణి రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు కలెక్టర్ విచారణ నిర్వహించారు. అనంతరం ఆ వైద్యాధికారిణిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 9, 2025
ప్రతి రైతుకు పరిహారం అందాలి: మంత్రి పొన్నం

మొంథా తుఫాన్ నష్టాలపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. నష్టపోయిన ఏ ఒక్క రైతు కూడా మిగలకుండా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేసి, పక్కాగా నివేదిక తయారు చేయాలని సూచించారు. రోడ్లు, విద్యుత్తు, నీటిపారుదల శాఖలకు సంబంధించి దెబ్బతిన్న నిర్మాణాలు, పంట నష్టాన్ని పూర్తి ఆధారాలతో నివేదించాలని, నష్టపోయిన వారికి సహాయం అందించాలని ఒక ప్రకటన విడుదల చేశారు.
News November 9, 2025
చౌక ధర దుకాణాలను తనిఖీ చేసిన రెవెన్యూ అదనపు కలెక్టర్

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని పలు రేషన్ దుకాణాలను రెవెన్యూ అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పట్టణంలోని షాప్ నంబర్ 34లో డీలర్ కాకుండా మరొక వ్యక్తితో షాపును నడిపిస్తున్న కారణంగా ఆయనకు షోకేస్ నోటీసు ఇవ్వాలని అర్బన్ తహశీల్దార్‌కు ఆదేశాలు జారీ చేశారు. రేషన్ దుకాణాలు సమయానికి అనుగుణంగా ఉదయం సాయంత్రం వేళల్లో తప్పనిసరిగా తెరిచి ఉండాలని ఆదేశించారు.
News November 9, 2025
ఓట్ చోరీ కవరింగ్ కోసమే SIR: రాహుల్

దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం దాడికి గురవుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ‘భారీగా ఓట్ల దొంగతనం జరుగుతోంది. హరియాణాలో మాదిరే MP, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలో జరిగింది. ఇది BJP, ECల వ్యవస్థ. నా దగ్గర మరిన్ని ఆధారాలు ఉన్నాయి. త్వరలోనే బయటపెడతా’ అని తెలిపారు. ‘ఓట్ చోరీ అనేది ప్రధాన సమస్య. దాన్ని కప్పిపుచ్చేందుకు, ఎన్నికల దుర్వినియోగాన్ని వ్యవస్థీకృతం చేసేందుకే <<18119730>>SIR<<>>’ అని ఆరోపించారు.


