News January 26, 2025

KMR: 4 పథకాలు ప్రారంభోత్సవ గ్రామాలు ఇవే..!

image

KMR జిల్లాలో ఆదివారం నాలుగు పథకాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. చిన్న నాగరం, ర్యాగట్లపల్లి, శివార్ రాంరెడ్డి పల్లి, గుండెకల్లూర్, రైతు నగర్, సీతారాం పల్లి, బ్రాహ్మణపల్లి, బంగారపల్లి, గూడెం, ఎల్లారం, రాజ్ కాన్ పేట్, రాచూర్, అచైపల్లి, రాముల గుట్ట తండా, సుల్తాన్ నగర్, చిన్న తక్కడ్ పల్లి, హస్నాపూర్, నడిమి తండా, కన్నాపూర్ తండా, వజ్జేపల్లి ఖుర్దు, సంతాయి పెట్, మల్లాయిపల్లి గ్రామాలను ఎంపిక చేశారు.

Similar News

News September 20, 2025

NGKL: రెసిడెన్షియల్ పాఠశాలలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు

image

జిల్లాలోని రెసిడెన్షియల్ పాఠశాలలలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను కాంట్రాక్ట్ పద్ధతిలో టీచర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ సంతోష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈనెల 17న వెలువడిన నోటిఫికేషన్‌కు గాను కోర్టు ఉత్తర్వులకు లోబడి ప్రొవిజినల్ లిస్ట్ సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ప్రొవిజినల్ లిస్టును జిల్లా వెబ్ సైట్‌లో డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.

News September 20, 2025

7 నుంచి కేయూ బీఫార్మసీ పరీక్షలు..!

image

కాకతీయ యూనివర్సిటీ సీబీసీఎస్ఈ బీఫార్మసీ రెండో సెమిస్టర్ పరీక్షలు అక్టోబరు 7 నుంచి నిర్వహిస్తామని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ అసీం ఇక్బాల్ తెలిపారు. అక్టోబరు 7, 9, 13, 15 తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.

News September 20, 2025

సిరిసిల్ల: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య

image

వేములవాడలో దారుణం జరిగింది. మాజీ కౌన్సిలర్ దారుణహత్యకు గురయ్యారు. స్థానికుల వివరాల ప్రకారం.. వేములవాడ నందికమాన్ వద్ద కారులో ఉన్న సిరిగిరి రమేశ్ ను గుర్తు తెలియని వ్యక్తి గొంతు కోసి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి మరిన్నీ వివరాలు తెలియాల్సి ఉంది.