News January 26, 2025
గాజువాకలో ఏడుగురు అరెస్ట్

గాజువాక సమీపంలోని పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు పేకాట శిబిరంపై శనివారం దాడి చేశారు. వుడా కాలనీలో పేకాట ఆడుతుండగా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు చేసి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.1,11,430 నగదుతో పాటు 7 మొబైల్స్ సీజ్ చేశారు. వీరిని న్యూ పోర్ట్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News January 26, 2026
మాధవధార: జలధార వద్ద భక్తులు ఫుల్.. సౌకర్యాలు నిల్!

మాధవధారలో జలధార వద్ద సింహాచలం దేవస్థానం ఉప దేవాలయలు, మాధవస్వామి ఆలయం ఉన్నాయి. మాఘ మాసంలో అధిక సంఖ్యలో జలధార స్నానం చేసేందుకు భక్తులు వస్తుంటారు. గతంలో లక్షల రూపాయల ఖర్చుపెట్టి స్నానాలు చేసేందుకు పైప్ లైన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఆ పైప్ లైన్ పనిచేయడం లేదు. మహిళల దుస్తులు మార్చుకోవడానికి గదులు, టాయిలెట్స్ కూడా లేవు. దీనిపై అధికారులు స్పందించాలని భక్తులు కోరుతున్నారు.
News January 26, 2026
సముద్ర గర్భంలో జాతీయ జెండా రెపరెపలు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఋషికొండ ఐటీ జంక్షన్ సమీప సముద్రంలో ‘డైవ్ అడ్డా’ ఆధ్వర్యంలో వినూత్నంగా వేడుకలు నిర్వహించారు. సీఈఓ భద్రం రామిశెట్టి పర్యవేక్షణలో డైవ్ మాస్టర్స్ బాబి, విష్ణవ్, అర్జున్, స్కోబా డైవర్ సంతోష్ కనకాల సుమారు 15 అడుగుల లోతుకు వెళ్లి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సముద్ర గర్భంలో త్రివర్ణ పతాకం రెపరెపలాడటం పట్ల పర్యాటకులు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
News January 26, 2026
విశాఖ: డిఫెన్స్, పోలీస్ శాఖలకు ఈరోజు ప్రత్యేక రాయితీ

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కైలాసగిరిలోని గ్లాస్ బ్రిడ్జి నిర్వాహకులు కీలక ప్రకటన చేశారు. దేశ, ప్రజా రక్షణలో నిరంతరం శ్రమిస్తున్న డిఫెన్స్, పోలీస్ శాఖల సిబ్బందికి గౌరవపూర్వకంగా ఈరోజు ప్రత్యేక రాయితీని ప్రకటించారు. టికెట్ ధరలో 50 శాతం డిస్కౌంట్ కల్పిస్తున్నట్లు RJ అడ్వెంచర్స్ నిర్వాహకులు రాజేష్ తెలిపారు. అర్హులైన సిబ్బంది తమ ఐడీ కార్డులను చూపి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.


