News January 26, 2025

జమ్మికుంట: ఎలివేటర్ యంత్రంలో ఇరుక్కొని మహిళా కూలీ మృతి

image

జమ్మికుంటకు చెందిన బమ్మ వనిత (54) శాయంపేటలోని ఆగ్రోఇండస్ట్రీస్ రైస్ మిల్లులో పనిచేస్తుంది. జనవరి 22న మిల్లులో పనిచేస్తుండగా ప్రమాదవశాత్తు ఎలివేటర్ యంత్రంలో తలకు ఉన్న టవల్ ఇరుక్కుని చెయ్యి తెగిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో మిల్లు సిబ్బంది వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందిందని ఆమె కుమారుడు ఈశ్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

Similar News

News September 19, 2025

కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

image

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.

News September 19, 2025

వైసీపీ కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించింది: పుల్లారావు

image

గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ ప్రతి పథకానికి తన బొమ్మ వేసుకోవాలనుకున్నారని, అందుకే స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ నిలిచిపోయిందని MLA ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. కూటమి ప్రభుత్వంలో దేశంలో అమలు కాని పథకాలన్నీ అమలవుతాయన్నారు. గత ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అప్పులు అప్పగించిందని ఆయన విమర్శించారు. చిలకలూరిపేటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

News September 19, 2025

కడప: అత్యాచారం కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష

image

బాలికను అత్యాచారం చేసిన కేసులో వేంపల్లెకు చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులుకు కడప పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్ జడ్జి యామిని 10 ఏళ్లు జైలు శిక్ష, రూ. 3 వేలు జరిమానా విధించారు. 15 ఏళ్ల బాలికను రామాంజనేయులు బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు ఆమె తల్లి 2019లో వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. DSP వాసుదేవన్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నేరం రుజువు కావడంతో శిక్ష పడింది.