News January 26, 2025

యుద్ధంతో 60 ఏళ్ల వెనక్కి గాజా: యూఎన్

image

హమాస్, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల గాజా 60 ఏళ్ల వెనక్కి వెళ్లిపోయిందని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. నగరాన్ని పునర్నిర్మించాలంటే కొన్ని బిలియన్ల డాలర్ల ఖర్చు అవుతుందని తెలిపింది. ప్రతి మూడు భవనాలకు రెండు బిల్డింగులు ధ్వంసమయ్యాయని, 42 మిలియన్ టన్నుల భవనాల శిథిలాల తొలగింపునకు 21 ఏళ్లు పడుతుందని లెక్కగట్టింది. ఎకానమీ పూర్తిగా దెబ్బతిన్నదని తెలిపింది. 20 లక్షల మంది నిరాశ్రయులుగా మిగిలారని వెల్లడించింది.

Similar News

News February 12, 2026

శివ నామాలు అర్థాలు ‘‘పశుపతి’’

image

వేదాల ప్రకారం ‘పశు’ అంటే కేవలం జంతువులు అని మాత్రమే కాదు, అజ్ఞానంతో, మాయతో బంధీ అయి ఉన్న ప్రతి జీవి అని అర్థం. జీవులన్నింటినీ రక్షించే వాడు, వారిని అజ్ఞాన బంధనాల నుంచి విముక్తం చేసే యజమాని శివుడు. మనలోని పశుప్రవృత్తిని(అరిషడ్వర్గాలను) అణచివేసి, మనల్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లే రక్షకుడు ఆయనే. సమస్త జీవరాశికి ఆయనే ఆధారభూతుడు. పాలకుడు. అందుకే శివుడిని భక్తులు పరమేశ్వరుడిగా, పశుపతిగా ఆరాధిస్తారు.

News February 12, 2026

నీటి వసతి లేకుంటే పామాయిల్ సాగు వద్దు

image

ఆయిల్ పామ్ సాగును ఎలాంటి నేలల్లో చేపట్టినా నీటి వసతి ముఖ్యం. వర్షాధారంగా ఈ పంట సాగును చేపట్టలేము. అందుకే ఏ రైతైనా ఆయిల్ పామ్ సాగు చేయాలనుకుంటే నీటి వసతి ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ పంట సాగు కోసం మొక్కకు రోజుకు 150 నుంచి 250 లీటర్ల నీరు అవసరం అవుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు. బోర్‌వెల్ ఉంటే మైక్రోఇరిగేషన్ ద్వారా నీరు అందించి మంచి దిగుబడులను పొందవచ్చు.

News February 12, 2026

28,636 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

పోస్టల్ శాఖలో 28,636 GDS పోస్టులకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. ఫిబ్రవరి 16వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో 1,060, తెలంగాణలో 608 పోస్టులు ఉన్నాయి. రాత పరీక్ష లేకుండా కేవలం టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వయసు 18-40ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. నెలకు జీతం BPMకు రూ.18వేలు, ABPMకు రూ.16వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://indiapost.gov.in/