News January 26, 2025
పల్నాడు జిల్లాలో నేడు ఆ రెండు బంద్

గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయించే దుకాణదారులకు ఆదేశాలు జారీ చేశాయి. నేడు ఆదివారం కావడంతో మందు, ముక్కతో వీకెండ్‌ను ఎంజాయ్ చేద్దామనుకున్న వారికి ఇది బ్యాడ్ న్యూస్ అని పలువురు అంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Similar News
News October 19, 2025
దీపావళి ‘విజేత’ ఎవరు?

ఈ సారి పండక్కి మీడియం, చిన్న సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. ఈ నెల 16న ప్రియదర్శి, నిహారిక నటించిన ‘మిత్ర మండలి’, 17న ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు ‘డ్యూడ్’, సిద్ధు, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ‘తెలుసు కదా’, 18న కిరణ్ అబ్బవరం, యుక్తి ‘K RAMP’ రిలీజయ్యాయి. ఎంటర్టైన్మెంట్, లవ్ బ్యాక్ డ్రాప్లో ఈ చిత్రాలు తెరకెక్కాయి. మీరు ఏ సినిమాకు వెళ్లారు? ఈ దీపావళి విజేత ఎవరు? కామెంట్.
News October 19, 2025
కొల్లాపూర్ పీజీ సెంటర్లో ఎంబీఏ స్పాట్ అడ్మిషన్లు

కొల్లాపూర్ పీజీ సెంటర్ (పాలమూరు విశ్వవిద్యాలయం)లో ఎంబీఏ మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ మార్క్ పోలోనియస్ తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు అక్టోబర్ 21, 2025 వరకు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలు, ఒరిజినల్ టీసీతో కొల్లాపూర్ పీజీ సెంటర్‌కు రావాలని ఆయన కోరారు. పూర్తి వివరాలకు 9908740482ను సంప్రదించాలని పేర్కొన్నారు.
News October 19, 2025
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఏకైక ధన్వంతరీ ఆలయం

తూ.గో. జిల్లాలోని చింతలూరు గ్రామంలో ధన్వంతరి స్వామి ఆలయం ఉంది. ఇక్కడ కాశీ ఏకశిలతో మలచిన పాలరాతి విగ్రహ రూపంలో స్వామివారు కొలువై ఉంటారు. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, అమృత కలశం, జలగ ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయాన్ని దర్శిస్తే సమస్త రోగాలు నయమవుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడే కాకుండా శ్రీరంగం రంగనాథ ఆలయం, కంచి వరదరాజ పెరుమాళ్ ఆలయం, కేరళలోని గురువాయూర్ సమీపంలో కూడా ధన్వంతరి ఆలయాలు ఉన్నాయి.