News January 26, 2025
ఎల్కతుర్తి PS వద్ద యాక్సిడెంట్.. మహిళ మృతి

ఎల్కతుర్తి మండల పోలీస్ స్టేషన్ ముందు ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందారు. మృతురాలు జంగం బుజ్జమ్మ(55)గా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహం వద్ద బంధువులు రోదిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 17, 2025
మాఘీ సీజన్, లేట్ రబీకి అనువైన జొన్న రకాలు

ఏపీలో కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో మాఘీ సీజన్ కింద.. లేట్ రబీ కింద ప్రకాశం, కృష్ణ, గుంటూరు జిల్లాల్లో జొన్న పంటను సాగు చేస్తారు. ఈ సీజన్లకు అనువైన వరి రకాలు NTJ-5, N-15, C.S.V-15, C.S.V-17, C.S.V-23, C.S.V-31, M-35-1. అధిక దిగుబడినిచ్చే హైబ్రిడ్ రకాలు C.S.H-14, C.S.H-15 R, C.S.H-18, C.S.H-16, C.S.H-35, C.S.H-23. నిపుణుల సూచన మేరకు ప్రాంతీయ పరిస్థితులకు అనుగుణంగా రకాలను ఎంపిక చేసుకోవాలి.

నెల్లూరు: సదరం.. నాట్ ఓపెన్..!

వికలాంగత్వ ధ్రువీకరణ కోసం తీసుకొచ్చిన “సదరం” సైట్ ఓపెన్ కావడం లేదు. ఈనెల 14 న సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినా.. రెండు రోజులకే మూతపడింది. అదేమిటంటే ఒకసారి స్లాట్స్ అయిపోయాయని చెప్పుకొచ్చారు. వెయిటింగ్ లిస్ట్ కింద అయినా దరఖాస్తు చేసుకుందామని ప్రయత్నం చేయగా.. సైట్ క్లోజ్ అయిపొయింది. ఇదేమి విచిత్రమని ప్రజలు వాపోతున్నారు. ఏడాది నుంచి ఇవే తిప్పలు ఎదురవుతున్నాయి.