News January 26, 2025
కాకినాడ కలెక్టర్‌కు ఉత్తమ ఎన్నికల అధికారి పురస్కారం

కాకినాడ కలెక్టర్ ఎస్ ఎస్ మోహన్ ఉత్తమ జిల్లా ఎన్నికల అధికారిగా పురస్కారం అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ చేతులమీదుగా ఉత్తమ ఎన్నికల అధికారిగా ఆయన అవార్డు స్వీకరించారు. అవార్డు స్ఫూర్తితో మరిన్ని సేవలు అందిస్తామన్నారు. కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, అర్బన్ తాహశీల్దార్‌లకు అవార్డులు దక్కాయి.
Similar News
News December 31, 2025
VKB: న్యూ ఇయర్.. రంగంలోకి ప్రత్యేక బృందాలు: SP

మహిళల రక్షణ కోసం షీ-టీమ్స్, బైక్ రేసింగ్‌ల నిర్వహన కట్టడికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు SP స్నేహ మెహ్రా తెలిపారు. రిసార్ట్స్ నిర్వాహకులు అతిథిల వివరాలను నమోదు చేయాలన్నారు. నిర్దేశించిన సమయం దాటిన తర్వాత వేడుకలకు అనుమతి లేదన్నారు. వైన్ షాప్‌లు, బార్లు నిర్ణిత సమయం వరకు అనుమతి ఉందన్నారు. మద్యం అనుమతి తీసుకున్న రిసోర్ట్స్, ఫార్మ్ హౌస్‌లలో ప్రభుత్వ నియమాలు ఖచ్చితంగా పాటించాలన్నారు.
News December 31, 2025
మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: కలెక్టర్

ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావుతో కలిసి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా ప్రభుత్వం పథకాలను విజయవంతంగా అమలు చేస్తోందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతాయని స్పష్టం చేశారు.
News December 31, 2025
రోడ్డు ప్రమాదంలో దేవరాపల్లి యువకుడి మృతి

వేపాడ(M) కుమ్మపల్లి జంక్షన్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవరాపల్లి మండలం కొత్తూరు ముత్యాలమ్మపాలెం గ్రామానికి చెందిన దేముడు నాయుడు(26) మృతి చెందాడు. కొత్తవలస నుంచి బైక్‌పై వస్తుండగా దేవరాపల్లి నుంచి వెళ్తున్న 12–డి బస్సును ఓవర్ టేక్ చేస్తుండగా అదుపుతప్పి పడిపోయారు. తీవ్రమైన గాయాలతో దేముడు నాయుడు అక్కడికక్కడే మృతిచెందినట్లు సమాచారం. బండి నడుపుతున్న మహేశ్ గాయపడగా చికిత్స పొందుతున్నారు.


