News January 26, 2025

అన్నమయ్య జిల్లా రయితకు రాజభవన్ పిలుపు

image

రిపబ్లిక్ డే సందర్భంగా విజయవాడలోని ‘రాజభవన్’లో ఎట్ హోమ్ జరగనుంది. ఈ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా నుంచి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ రచయిత, రాష్ట్ర అధికార భాషా సంఘ మాజీ సభ్యులు అబ్దుల్ ఖాదర్‌కు ఆహ్వానం అందిదంది. కలికిరి తహసీల్దార్ మహేశ్వరీబాయి ఆయనకు ఆహ్వానపత్రాన్ని అందించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించినందుకు అబ్దుల్ ఖాదర్‌కు ఈ గౌరవం దక్కింది.

Similar News

News March 12, 2025

తూ.గో. జిల్లాకు ప్రత్యేక అధికారి

image

ప్రభుత్వ కార్యక్రమాల పర్యవేక్షణ, అమలు బాధ్యతలను సీనియర్‌ IAS అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు ప్రకారం సీనియర్‌ ఐఏఎస్‌ అధికారిగా ప్రవీణ్ కుమార్‌ను తూ.గో.జిల్లా ఇన్‌ఛార్జ్‌గా ప్రభుత్వం కేటాయించింది. జోనల్ ఇన్‌ఛార్జ్‌గా అజయ్ జైన్‌ను నియమించింది. ప్రభుత్వ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

News March 12, 2025

వచ్చే నెల అమరావతికి ప్రధాని మోదీ!

image

AP: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెలలో రాజధాని అమరావతి పనులను పున:ప్రారంభించనుంది. ఈ కార్యక్రమానికి రావాలని ప్రధాని మోదీని ఆహ్వానించగా ఆయన అంగీకరించినట్లు సమాచారం. త్వరలో ప్రధాని కార్యాలయం అమరావతి పర్యటన తేదీని ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజధాని పనులను అట్టహాసంగా మళ్లీ స్టార్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 9ఏళ్ల కిందట అమరావతి పనులకు మోదీ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

News March 12, 2025

సంగారెడ్డి: 33 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ

image

సంగారెడ్డి జిల్లాలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న 33 ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. ప్రాథమిక పాఠశాలలో చదివే 3 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కంప్యూటర్‌పై అవగాహన కల్పించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

error: Content is protected !!