News January 26, 2025

30 ఏళ్ల పోరాటానికి దక్కిన గుర్తింపు

image

1965లో ఉమ్మడి వరంగల్(D) న్యూశాయంపేటలో జన్మించిన మందకృష్ణ మాదిగ విద్యార్థి దశలోనే కులవివక్షపై పోరాడారు. కొంతకాలం పీపుల్స్‌వార్‌లో పనిచేశారు. తర్వాత బయటికొచ్చి దళిత ఉద్యమకారుడిగా మారారు. SC వర్గీకరణ కోసం 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించారు. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాట ఫలితంగా గతేడాది SC వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈక్రమంలోనే నిన్న ఆయనకు కేంద్రం ‘పద్మశ్రీ’ ప్రకటించింది.

Similar News

News December 27, 2025

న్యూఇయర్‌కి ఫ్యామిలీతో ఉంటారా.. జైల్లో ఉంటారా: సజ్జనార్

image

TG: జనవరి 1 వరకు స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ కొనసాగుతుందని హైదరాబాద్ CP సజ్జనార్ పేర్కొన్నారు. 2025 వార్షిక నేర నివేదిక విడుదల సందర్భంగా పౌరులను హెచ్చరించారు. ‘మద్యం తాగి పట్టుబడితే జైల్లో వేయటం ఖాయం. HYD మొత్తం ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంకెన్ డ్రైవ్‌ నడుస్తోంది. ఈ ఏడాది నగరంలో నేరాలు 15% తగ్గాయి. పోక్సో కేసులు కూడా తగ్గుముఖం పట్టాయి. 368 కేసుల్లో రూ.6.45 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్ చేశాం’ అని తెలిపారు.

News December 27, 2025

జరీబు భూములపై పరిశీలనకు ఆదేశం

image

AP: రాజధాని ప్రాంతంలోని జరీబు(3 పంటలు పండేవి) భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూముల వర్గీకరణపై పున:పరిశీలనకు రాష్ట్రస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. జరీబు, నాన్ జరీబు భూములు ఇచ్చినవారికి ప్లాట్లు ఇస్తున్నామని, ఈ ప్రక్రియ 45రోజుల్లో పూర్తి చేయనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు.

News December 27, 2025

పోస్ట్ పార్టమ్ డిప్రెషన్‌కు దీంతో చెక్

image

కొందరు మహిళలు డెలివరీ తర్వాత డిప్రెషన్‌కు లోనవుతుంటారు. దీనివల్ల తల్లీబిడ్డలిద్దరికీ ప్రమాదమే అంటున్నారు నిపుణులు. అయితే డెలివరీ తర్వాత డిప్రెషన్ రాకుండా తక్కువ మోతాదులో ఎస్కెటమైన్‌ ఇంజెక్షన్‌ ఇస్తే ఫలితం ఉంటుందంటున్నారు. డిప్రెషన్‌కు వాడే కెటమైన్‌ అనే మందు నుంచే ఎస్కెటమైన్‌ను తయారు చేస్తారు. పరిశోధనల్లో ఇది సుమారు 75% వరకూ డిప్రెషన్ లక్షణాలు రాకుండా చూసినట్లు పరిశోధకులు వెల్లడించారు.