News January 26, 2025
నాగర్‌కర్నూల్: ఆదర్శంగా రైతు దంపతులు

నాగర్‌కర్నూల్ జిల్లా కార్వంగ గ్రామానికి చెందిన లావణ్య, రమణారెడ్డి దంపతులు 24 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. రసాయనాలను వాడకుండా, కషాయాలు, ఆవు మూత్రం, పేడతో తయారు చేసిన సేంద్రియ ఎరువులతో వరి, మిర్చి, పసుపు వంటి పంటలు సాగుచేస్తున్నారు. ప్రకృతి, నేల, నీటికి నష్టం చేయకుండా సాగు నిర్వహిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
Similar News
News November 8, 2025
ఆదోని: ఈతకెళ్లి బాలుడి మృతి

ఆదోని పరిధిలోని బసాపురంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గౌరమ్మ పండుగ సందర్భంగా పుట్టింటికి వచ్చిన బిచ్చల ఈరన్న కూతురు వరమ్మ కుమారుడు కాలువలో శవంగా తేలాడు. శుక్రవారం పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగారు. ఐతే బాలుడు ఒంటరిగా ఈత ఆడుకుంటూ కాలువలో కొట్టుకుపోయాడు. శనివారం హనువాళ్లు గ్రామంలో మృతదేహం లభ్యమైంది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News November 8, 2025
సంగారెడ్డి: 112న ఉమ్మడి జిల్లా యోగాసన ఎంపికలు

సిద్దిపేట జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య (SGF) ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉమ్మడి మెదక్ జిల్లా యోగాసన ఎంపికలు జరుగనున్నట్లు SGF జిల్లా కార్యదర్శి సౌందర్య తెలిపారు. సిద్దిపేట మండలం నారాయణరావుపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఉదయం 9.30 గంటలకు ఇవి ప్రారంభమవుతాయన్నారు.
ఆసక్తిగల యోగా క్రీడాకారులు తమ జనన ధ్రువీకరణ, ఆధార్, బోనఫైడ్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని ఆమె సూచించారు.
News November 8, 2025
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న పవన్

జిల్లా పర్యటనలో భాగంగా Dy.CM పవన్ కళ్యాణ్ తిరుపతి మంగళంలోని ఎర్రచందనం నిల్వ ఉన్న గోడౌన్‌కు చేరుకున్నారు. ఇందులో భాగంగా ఆయన అక్కడ ఎర్రచందనం దుంగలను పరిశీలించారు. ఎన్ని టన్నుల దుంగలు ఉన్నాయి వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.


