News January 26, 2025

తెలంగాణ భవన్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు

image

గణతంత్ర దినోత్సవ వేడుకలను తెలంగాణ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటామన్నారు.

Similar News

News March 14, 2025

HEADLINES

image

* TG: డీలిమిటేషన్ పేరిట దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం కుట్ర: CM రేవంత్
* అసెంబ్లీ స్పీకర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు.. సభ నుంచి జగదీశ్ రెడ్డి సస్పెండ్
* కేసీఆర్ తెలంగాణను దోచుకున్నారు: MLC విజయశాంతి
* మా వల్లే గతంలో కాంగ్రెస్ ఉచిత కరెంట్ ఇచ్చింది: CM చంద్రబాబు
* వచ్చే ఏడాది నుంచి FEB చివర్లోనే ఇంటర్ పరీక్షలు: లోకేశ్
* AP, TGలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక ఏకగ్రీవం

News March 14, 2025

WPL: ఫైనల్లో ముంబై

image

గుజరాత్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. MI ముందుగా బ్యాటింగ్ చేయగా మాథ్యూస్(77), స్కివర్ బ్రంట్(77) విధ్వంసంతో 213 పరుగులు చేసింది. ఛేదనలో గుజరాత్ కనీస పోటీని ఇవ్వలేకపోయింది. క్రమం తప్పకుండా వికెట్లు పడటంతో 19.2 ఓవర్లలో 166 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో గిబ్సన్(34)దే అత్యధిక స్కోరు. దీంతో ముంబై ఫైనల్ చేరింది. ఈ నెల 15న ఢిల్లీతో ట్రోఫీ కోసం పోటీ పడనుంది.

News March 14, 2025

హోలీ.. రేపు ‘బ్లడ్ మూన్’

image

రంగుల పండుగ హోలీ వేళ రేపు ఆకాశంలో అద్భుతం చోటు చేసుకోనుంది. సూర్యుడికి చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చి చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఫలితంగా భూమి వాతావరణంలో నుంచి చంద్రుడిపైకి సూర్యకిరణాలు ప్రసరించి జాబిల్లి ఎర్రగా మారనుంది. దీన్నే ‘బ్లడ్ మూన్‌గా పిలుస్తారు. కానీ ఇది భారత్‌లో కనిపించదు. యూరప్ దేశాలతో పాటు సౌత్, నార్త్ అమెరికా, వెస్ట్రన్ ఆఫ్రికా దేశాల్లో బ్లడ్ మూన్ 65 నిమిషాల పాటు కనువిందు చేయనుంది.

error: Content is protected !!