News January 26, 2025
NZB: మొదటి బహుమతి సాధించిన షేక్ అమీనా

జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం నిర్వహించిన వ్యాసరచన పోటీలలో నిజామాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని షేక్ అమీనా మొదటి బహుమతి సాధించింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో శనివారం ఉదయం షేక్ అమీనాకు కలెక్టర్ ప్రశంసాపత్రం తో పాటు మెమెంటోను అందజేశారు. ఈ సందర్భంగా వారిని DIEO రవికుమార్ అభినందించారు.
Similar News
News November 12, 2025
NZB: అభినందన సభావేదికను పరిశీలించిన కాంగ్రెస్ నేతలు

బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా నియమితులై గురువారం జిల్లా కేంద్రానికి వస్తున్న సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత కలెక్టరేట్ లో సుదర్శన్ రెడ్డికి అభినందన సభ నిర్వహించనున్నారు. ఈ మేరకు సభా స్థలిని బుధవారం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ లు పరిశీలించారు.
News November 12, 2025
NZB: మద్యం సేవించి వాహనాలు నడపవద్దు: సీపీ

మద్యం సేవించి వాహనాలు నడపవద్దని నిజామాబాద్ కమిషనర్ పి.సాయి చైతన్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మోటార్ వాహన చట్టం(2019) ప్రకారం డ్రంక్ & డ్రైవ్ తనిఖీలలో మొదటిసారి పట్టుబడితే రూ.10,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని అన్నారు. 3 సంవత్సరాల వ్యవధిలో రెండోసారి పట్టుబడితే రూ.15,000/- జరిమానా లేదా 6 నెలల జైలు శిక్ష లేదా రెండూ విధించబడతాయని పేర్కొన్నారు.
News November 12, 2025
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది: ఎంపీ అర్వింద్

ఇందూరు పట్టణంలో పసుపు బోర్డుకు తగిన స్థలం కేటాయించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. పసుపు బోర్డుకు స్థలం కేటాయించకుండా అడ్డుకుంటున్న జిల్లా నేతలు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి, బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌లకు ఇందూరు ప్రజలే బుద్ధి చెప్పాలని ఎంపీ అర్వింద్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


