News January 26, 2025
ఇది కర్షక ప్రభుత్వం: గవర్నర్ జిష్ణుదేవ్

TG: ప్రజా ప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ‘వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వనున్నాం. సన్నరకం బియ్యానికి బోనస్ అందించాం.2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేశాం. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నాం. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తున్నాం’ అని గణతంత్ర దినోత్సవం ప్రసంగంలో వివరించారు.
Similar News
News January 10, 2026
ఇరాన్ విప్లవం గురించి తెలుసా?

ఇరాన్ చివరి రాజు మహ్మద్ రెజా షా పహ్లావి 1941 నుంచి 1979 వరకు పాలించారు. ఆయిల్ నిల్వలను అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో మత పెద్దలు, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అయతుల్లా రుహొల్లా ఖమేనీ నాయకత్వంలో(1979) ఇస్లామిక్ విప్లవంతో రెజా దేశం విడిచి పారిపోయారు. ఖమేనీ US కంపెనీలను బహిష్కరించారు. మహిళలపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఖమేనీల పాలనపై <<18808619>>వ్యతిరేకత<<>> మొదలైంది.
News January 10, 2026
పోక్సో చట్టంలో ‘రోమియో-జూలియట్’ రూల్ తీసుకురండి: SC

పోక్సో చట్టం దుర్వినియోగంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. స్వచ్ఛమైన టీనేజ్ లవ్ రిలేషన్స్‌ను ప్రాసిక్యూషన్ నుంచి మినహాయించేందుకు పోక్సో చట్టంలో ‘రోమియో-జూలియట్’ రూల్ తీసుకురావాలని సూచించింది. వ్యక్తిగత కక్షలు తీర్చుకునేందుకు చట్టాన్ని వాడుకుంటున్నారని పేర్కొంది. టీనేజర్లు పరస్పర అంగీకారంతో లైంగిక సంబంధం పెట్టుకుంటే దాన్ని నేరంగా పరిగణించకుండా రక్షణ కల్పించే మినహాయింపే రోమియో-జూలియట్ రూల్.
News January 10, 2026
నేను వైద్యుడిని కాదు.. సోషల్ డాక్టర్ని: రేవంత్

TG: తాను వైద్యుడిని కాదని, సోషల్ డాక్టర్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఫెలోస్ ఇండియా కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ‘నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. నాలెడ్జ్‌ను ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ చేసుకోవడంతో నైపుణ్యాలు పెంచుకోవాలి. కొత్త విషయాలు తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్‌కు ముగింపు పలికినట్లే. క్వాలిటీ ఆఫ్ హెల్త్ గురించి అంతా కృషి చేయాలి’ అని ఆయన కోరారు.


