News January 26, 2025
స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు: గవర్నర్
AP: ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందని గవర్నర్ నజీర్ అన్నారు. విజయవాడలో గణతంత్ర వేడుకల్లో మాట్లాడుతూ ‘గత ప్రభుత్వం భారీగా అప్పులు చేసి సమస్యలు సృష్టించింది. స్వర్ణాంధ్ర విజన్ దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు కేంద్రం నుంచి ప్రత్యేక ప్యాకేజీ వచ్చేలా చేసింది. ప్రజలకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం కలగాలనేదే ప్రభుత్వ నినాదం’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News January 27, 2025
141 ఏళ్లలో ఇదే తొలిసారి..
విండీస్‌తో జరిగిన <<15279795>>రెండో టెస్టులో<<>> PAK స్పిన్నర్ నోమన్ అలీ రికార్డు సృష్టించారు. 141 ఏళ్ల చరిత్రలో మ్యాచ్ తొలిరోజు మొదటి గంటలోనే హ్యాట్రిక్ వికెట్లు తీసిన స్పిన్నర్‌గా నిలిచారు. 1883లో ఆసీస్ బౌలర్ బిల్లీ గేట్స్ ఈ ఘనత సాధించారు. అలాగే ఫస్ట్ సెషన్‌లోనే హ్యాట్రిక్ తీసిన ఆరో బౌలర్‌గా, సెకండ్ ఓల్డెస్ట్ ప్లేయర్(38Y 139D)గానూ నిలిచారు. శ్రీలంక క్రికెటర్ రంగన హెరాత్ 38Y 110D వయసులో హ్యాట్రిక్ తీశారు.
News January 27, 2025
నాగోబా జాతర శుభాకాంక్షలు చెప్పిన సీఎం
TG: దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన నాగోబా జాతర సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆదిలాబాద్ (D) కేస్లాపూర్‌లో (మెన్షన్) మెస్రం వంశస్థుల ఆధ్వర్యంలో 5 రోజుల పాటు సాగుతుందని, భక్తులు నాగోబాను దర్శించుకొని ఆశీస్సులు అందుకోవాలని ఆకాంక్షించారు. అధికారికంగా నిర్వహిస్తున్న ఈ జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తైనట్లు వెల్లడించారు. కాగా రేపటి నుంచి జాతర ప్రారంభం కానుంది.
News January 27, 2025
కొత్త క్యాంపెయిన్ ప్రారంభించిన వైసీపీ
AP: అధికార మదంతో కూటమి నేతలు ఊరురా దాడులు, దౌర్జన్యానికి పాల్పడుతూ అక్రమాలు చేస్తున్నారని వైసీపీ మండిపడింది. బాధితులకు అండగా ఉంటామంటూ కొత్త క్యాంపెయిన్ షురూ చేసింది. ‘మీ ఊరిలో కూటమి నేతలు అరాచకాలు చేస్తే ఫొటోలు, వీడియోలు తీసి #KutamiFiles #ConstituencyName ట్యాగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి’ అని పిలుపునిచ్చింది. బాధితుల తరఫున వైసీపీ పోరాటం చేస్తుందని పేర్కొంది.