News January 26, 2025

కోవెలకుంట్లలో అమానవీయ ఘటన..కాలువలో శిశువు

image

కోవెలకుంట్ల పట్టణంలోని సంతపేటలో మురికి కాలువలో ఆడ శిశువును పడేసిన అమానవీయ ఘటన శనివారం సాయంత్రం జరిగింది. కాలువలో శిశువు విషయాన్ని పోలీసులకు స్థానికులు తెలుపగా హెడ్‌PC కృష్ణ నాయక్ అక్కడికి చేరుకొని పసికందును ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే శిశువు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. విక్కీ ఫౌండేషన్ సభ్యులు అంత్యక్రియలు చేపట్టారు.

Similar News

News November 7, 2025

దళితులైతే దాడులు చేస్తారా?: మందకృష్ణ మాదిగ

image

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్‌ గవాయిపై కాలు, బూటుతో దాడి చేయడాన్ని MRPS వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్రంగా ఖండించారు. ఆయన దళితుడు అయినందువల్లే ఇలాంటి దాడులకు పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. పాలమూరు విశ్వవిద్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 17న నిర్వహిస్తున్న ‘చలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని పీయూ నుంచి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

News November 7, 2025

NGKL: లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ దిశా నిర్దేశం

image

జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో లైసెన్స్‌డ్ సర్వేయర్లకు అదనపు కలెక్టర్ పి. అమరేందర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడీ ల్యాండ్ సర్వే నాగేందర్ సర్వేయర్లకు సూచనలు చేశారు. జిల్లాలో నాలుగు మండలాల్లోని నాలుగు గ్రామాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి, ప్రభుత్వ భూములను గుర్తించి సర్వే చేయాలని ఆదేశించారు. జిల్లాలోని సర్వేయర్లు అంతా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News November 7, 2025

HYD: వాట్సప్‌‌లో ‘ది ఎండ్’ అని స్టేటస్.. యువతి సూసైడ్ అటెంప్ట్

image

ఔషాపూర్ అనురాగ్ యూనివర్సిటీలో BSC నర్సింగ్ 3rd ఇయర్ విద్యార్థిని పూజిత (22) కాలేజీ బిల్డింగ్ నుంచి దూకిన విషయం తెలిసిందే. తీవ్ర గాయాలు కాగా ఆమెను నిమ్స్‌కు తరలించారు. అన్నోజిగూడలో నివాసం ఉంటోంది. జ్వరం రావడంతో కళాశాలకు స్నేహితులతో వచ్చింది. బుధవారం వాట్సప్ స్టేటస్‌లో ‘ది ఎండ్’ అని పెట్టుకుంది. మధ్యాహ్నం లంచ్‌కి రాకుండా ఫోన్‌లో మాట్లాడి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.