News January 26, 2025
భీమవరానికి హీరో వెంకటేశ్, మీనాక్షి చౌదరి
సంక్రాంతికి వస్తున్నాం సినిమా సక్సెస్ మీట్ ఆదివారం భీమవరంలో నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. స్థానిక ఎస్ఆర్కే ఇంజినీరింగ్ కళాశాలలో ఈవెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మీట్‌కి హీరో వెంకటేశ్, హీరోయిన్లు, ఏలూరు జిల్లా బుల్లిరాజు, మరికొంత మంది నటులు సందడి చేయనున్నారు. ఈ సినిమా రిలీజైన రోజే రూ.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించిందని చిత్ర బృందం పేర్కొంది.
Similar News
News January 27, 2025
పట్టుదల ఉంటే సాధ్యం కానిది ఏదీ ఉండదు: ఎస్పీ
ఉద్యోగ సాధనలో పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని అనంతపురం ఎస్పీ జగదీశ్ అభిప్రాయపడ్డారు. కానిస్టేబుల్ ఈవెంట్స్‌లో అర్హత సాధించి మెయిన్స్‌కు ఎంపికైన ఎస్కేయూ విద్యార్థులు 150 మందికి, జిల్లా హోమ్ గార్డులు 20 మందికి ఎస్పీ చేతుల మీదుగా స్టడీ మెటీరియల్ అందించారు. ఎస్పీ మాట్లాడుతూ.. పట్టుదల, అంకిత భావంతో ఏదైనా సాధించవచ్చని అన్నారు.
News January 27, 2025
8 మంది బందీలు మరణించారు: హమాస్
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తొలి విడతలో హమాస్ 33 మంది బందీల విడుదలకు అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో 8 మంది చనిపోయినట్లు హమాస్ వెల్లడించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం పేర్కొంది. ఇప్పటికే ఏడుగురు బందీలను హమాస్ విడుదల చేసింది. ఈ క్రమంలో పలువురు బందీలు మరణించడంపై ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
News January 27, 2025
కురుపాం: బుల్లెట్ బండిపై కలెక్టర్ పర్యటన
కురుపాం మండలం కరలగండ గ్రామంలోని గుమ్మిడిగెడ్డ ఆనకట్టను ప్రభుత్వ విప్, కురుపాం MLA తోయక జగదీశ్వరితో కలిసి జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సోమవారం పరిశీలించారు. బుల్లెట్ పై వెళ్తూ ఓ సాధారణ వ్యక్తిలా పర్యటించారు. స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. సాధారణ వ్యక్తిలా కలెక్టర్ బుల్లెట్ పై పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.