News January 26, 2025
మన తొలి ‘రిపబ్లిక్ డే’కు అతిథి ఎవరంటే..

ఈ ఏడాది భారత గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే. మన తొలి రిపబ్లిక్ డేకు కూడా ఇండోనేషియా అధ్యక్షుడే చీఫ్ గెస్ట్ కావడం విశేషం. 1950లో ఇర్విన్ యాంఫీ థియేటర్లో నిర్వహించిన వేడుకలకు ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్ణో ప్రత్యేక అతిథిగా వచ్చారు. ఆ దేశానికి స్వాతంత్ర్యం దక్కడంలో భారత్ అండగా నిలిచింది.
Similar News
News January 27, 2026
నేడు ఇలా చేస్తే.. ముక్తికి మార్గం!

ఈరోజు మధ్వనవమి. నేడు ఆధ్యాత్మిక సాధన చేస్తే అపారమైన పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. ఈ పవిత్ర దినాన హరివాయుస్తుతి, మధ్వనామ పారాయణ చేయాలని పండితులు సూచిస్తున్నారు. విష్ణువును అర్చించి, గురువులను స్మరిస్తే మనస్సులోని అజ్ఞానం తొలగి జ్ఞానోదయం కలుగుతుందని చెబుతున్నారు. సకల పాపాలను హరించి, మోక్ష మార్గాన్ని సుగమం చేసే ఈ రోజున అన్నదానం, వస్త్రదానం చేస్తే వాయు దేవుడి అనుగ్రహంతో మంచి జరుగుతుంది’ అంటున్నారు.
News January 27, 2026
ఏ పంటల్లో ఎలాంటి ఎర పంటలను వేస్తే మంచిది?

☛ పత్తి, వేరుశనగ చుట్టూ ఆముదపు పంటను ఎర పంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను నివారించవచ్చు. ☛ క్యాబేజీలో ఆవాల పంటను వేసి డైమండ్ బ్యాక్ మాత్‌ను నివారించవచ్చు. ☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్రగొంగళి పురుగుల ఉద్ధృతి తగ్గించవచ్చు. ☛ అలసందలు పంటలో ఆవాలును ఎర పంటగా వేసి గొంగళిపురుగు, పొద్దుతిరుగుడు మొక్కలను నాటి కాయతొలుచు పురుగులను నివారించవచ్చు.
News January 27, 2026
శ్రీకాకుళం జిల్లాలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

AP: శ్రీకాకుళం జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో 4 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. ఉద్యోగాన్ని బట్టి టెన్త్, డిగ్రీ , కంప్యూటర్ నాలెడ్జ్‌తో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, వైవా వోస్ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.1000, SC, ST, PwBDలకు రూ.500. వెబ్‌సైట్: https://srikakulam.dcourts.gov.in/


