News January 26, 2025

బాలకృష్ణకు మంత్రి అభినందనలు 

image

బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్నమయ్య జిల్లాకు చెందిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి హైదరాబాద్‌లో బాలకృష్ణను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. మంత్రి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా తన నటనతో కోట్లాది మంది ప్రేక్షకులను ఆకట్టుకుని వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు.

Similar News

News March 15, 2026

తాళ్లపాలెం నుంచి యూటర్న్ తీసుకున్న పెద్దపులి

image

ఆదివారం రాత్రి మరోసారి పెద్ద పులి యూటర్న్ తీసుకుంది. తాళ్లపాలెంలో మకాం వేసిన పులి రాత్రి మండపం నుంచి శంఖవరం వచ్చే రహదారిలో మాజీ ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ ఇంటి సమీపంలో తిష్ఠ వేసిందని అధికారులు తెలిపారు. శంకవరం-మండపం రోడ్డులో బ్రిడ్జి సమీపంలో ఇది ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. అటవీ శాఖ అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.

News March 15, 2026

రాజంపేట RTC బస్టాండ్‌లో ప్రయాణికుల తిప్పలు

image

తిరుపతి వెళ్లడానికి ఆదివారం సాయంత్రం బస్సులు లేకపోవడంతో అవస్థలు పడ్డామని ప్రయాణికులు ఆరోపించారు. 2 గంటల సేపు వేచిఉన్న తర్వాత వేరే డిపో బస్సు వచ్చిందన్నారు. అది కూడా అధిక ప్రయాణికులతో నిండుగా రావడంతో సీట్లు లేక నిలబడి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రాజంపేట డిపో నుంచి తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్, శ్రీశైలానికి రాత్రి పూట లగ్జరీ/ఏసీ బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.