News March 18, 2024
వచ్చే వారం పిఠాపురానికి పవన్ కళ్యాణ్
AP: వచ్చే ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. వచ్చే వారం నియోజకవర్గంలో పర్యటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. 3 మండలాలు, 2 మున్సిపాలిటీలకు చెందిన టీడీపీ-జనసేన-బీజేపీ నేతలతో సమావేశం కానున్నట్లు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పలువురు కీలక నేతలు పార్టీలో చేరతారని వెల్లడించాయి. కాగా తొలిసారి పవన్ పర్యటనకు వస్తుండటంతో జనసేన శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.
Similar News
News December 24, 2024
అల్లు అర్జున్ను విచారించేది వీరే..
TG: అల్లు అర్జున్ కాసేపట్లో తన లీగల్ టీమ్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఆ టీమ్‌తోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అల్లు అర్జున్‌కు నిన్న పోలీసులు BNS 35(3) కింద నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
News December 24, 2024
స్కూళ్లకు కీలక ఆదేశాలు
TG: పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను జనవరి 31లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందుకు DEOలు, MEOలు, HMలను బాధ్యులుగా చేస్తూ ఉత్తర్వులిచ్చింది. విద్యార్థుల వివరాల సేకరణకు ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కేవలం 3 శాతమే పూర్తయింది. దీంతో ఈ ప్రక్రియను వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటోంది.
News December 24, 2024
నో డిటెన్షన్ రద్దు: పేరెంట్స్ మీ అభిప్రాయమేంటి?
కేంద్రం 5, 8 తరగతులకు నో డిటెన్షన్ విధానాన్ని రద్దు చేయడం AP, TGలో చర్చనీయాంశంగా మారింది. హాజరు శాతాన్ని బట్టి పై తరగతులకు ప్రమోట్ చేయడం వల్ల విద్యలో నాణ్యత కొరవడిందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఐదో క్లాస్ పిల్లలకు రెండో క్లాస్ కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు రావడం లేదన్న వార్తలు గతంలో చాలానే విన్నాం. మరి 5, 8 క్లాసులకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉండాలన్న నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తారా?