News January 26, 2025

జోగులాంబ అమ్మవారి సేవలో సినీ ప్రముఖులు

image

జోగులాంబ, బాల బ్రహ్మేశ్వర ఆలయాలను ఇవాళ ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణ, పోతుగల్ సినిమా హీరో ఉభయ దర్శించుకున్నారు. వీరికి దేవస్థానం వారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అర్చకుల చేత తీర్థప్రసాదాలు అందించి ఆలయం స్థల పురాణం వివరించారు. ఈ సందర్భంగా అన్నపూర్ణ మాట్లాడుతూ.. అమ్మవారి దర్శనం బాగా జరిగిందని తెలిపారు. అనంతరం తుంగభద్ర పుష్కర ఘాట్ నదిని వీక్షించారు.

Similar News

News July 4, 2025

అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్.. నోటీసులు ఇచ్చే అవకాశం?

image

TG: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై టీపీసీసీ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఆయనకు షోకాజ్ నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం. తెలంగాణలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని, ఇరిగేషన్&రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారేనని ఇటీవల అనిరుధ్ <<16911067>>వ్యాఖ్యానించిన<<>> సంగతి తెలిసిందే. దీనిపై వివరణ కోరి నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ ఆదేశించినట్లు సమాచారం.

News July 4, 2025

నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా రోశయ్య జయంతి

image

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ డా.కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలను శుక్రవారం నిర్మల్ కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు కలిసి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

News July 4, 2025

బహిరంగ ప్రదేశాల్లో నిషేధాజ్ఞలు: KNR సీపీ

image

సాధారణ పౌరులు, ప్రధానంగా మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని KNR కమీషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను ఈ నెల 31 వరకు పొడిగించినట్లు KNR CP గౌస్ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి ఘర్షనలకు పాల్పడుతున్న మందుబాబులపై పలు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఉపక్రమించినట్లు సీపీ పేర్కొన్నారు.